‘మండేలా’ రీమేక్ లో సునీల్ ?

395

ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఓ పాపులర్ రీమేక్ లో నటించబోతున్నారా ? అంటే అనే అవుననే సమాధానం విన్పిస్తోంది. తమిళ చిత్రం ‘మండేలా’ గత నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అనిల్ సుంకర బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘మండేలా’ తెలుగు రీమేక్ లో సునీల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సునీల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ‘మండేలా’ మూవీ కామెడీతో కూడిన పొలిటికల్ సెటైర్ మూవీ. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో ‘మండేలా’ తెరకెక్కింది. ఈ చిత్రంలో యోగిబాబు నటనకు ప్రశంసల వర్షం కురిసింది. తెలుగులో సునీల్ ఆ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని సమర్థవంతంగా తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.