తగ్గిన వెండి ధరలు..

132

దేశీయంగా వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర తాజాగా దిగి వచ్చింది. అయితే వెండి ధర గత సంవత్సరం ఆగస్టు నెలలో కిలోకు రూ. రూ.79,980 స్థాయికి చేరింది. అంటే అప్పటి నుంచి చూస్తే వెండి ధర ఏకంగా రూ.11 వేలు పతనమైంది. ప్రస్తుతం దేశీయంగా చూస్తే వెండి ధర రూ.69,700 వద్ద కదలాడుతోంది. అయితే తాజాగా గురువారం వెండి ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.300 నుంచి 400 వరకు తగ్గగా, హైదరాబాద్‌లో ఏకంగా రూ.1300 వరకు తగ్గముఖం పట్టింది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

కిలో వెండి ధర
ఢిల్లీ:
  రూ.69,700
ముంబై: రూ.69,700
చెన్నై:  రూ.74000
కోల్‌కతా: రూ.69,700 ఉంది.
బెంగళూరు: రూ.74,000
కేరళ: రూ.67,700
హైదరాబాద్‌:రూ.74,000
విజయవాడ: రూ.74,000