కార్డుదారులకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ

146

రాష్ట్రవ్యాప్తంగా 36.99 లక్షల కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

రాష్ట్రవ్యాప్తంగా మే నెలకు సంబంధించి ఇప్పటి వరకు 36 లక్షల 99 వేల 819 బియ్యం కార్డుదారులకు ఉచితంగా నాణ్యమైన సార్టెక్స్ స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. మే, జూన్ నెలల్లో బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 27 వేల 764 బియ్యం కార్డులు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉచితంగా మే, జూన్ నెలల్లో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.       ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో మొత్తం 9 లక్షల 96 వేల 073 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 06 వేల 067 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేశామన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 13 వేల 940 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 80 వేల 525 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 42 వేల 454 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 41 వేల 036 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 13 వేల 453 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 29 వేల 910 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 54 వేల 977 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 12 వేల 764 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 72 వేల 917 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 06 వేల 372 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లక్షల 95 వేల 821 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 72 వేల 959 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 16 వేల 927 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 34 వేల 371 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 78 వేల 955 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 70 వేల 580 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 44 వేల 964 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 72 వేల 882 కార్డులకు , కృష్ణాజిల్లాలో మొత్తం 12 లక్షల 98 వేల 567 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 59 వేల 438 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 11 వేల 716 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 55 వేల 908 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 87 వేల 002 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 57 వేల 007 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసినట్టు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు.
కర్నూలు జిల్లాలో 31.34 శాతం, ప్రకాశం జిల్లాలో 30.72 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 28.26 శాతం, అనంతపూర్ జిల్లాలో 27.47 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 27.44 శాతం, చిత్తూరు జిల్లాలో 27.07 శాతం, గుంటూరు జిల్లాలో 25.05 శాతం, విజయనగరం జిల్లాలో 24.85 శాతం, విశాఖపట్నం జిల్లాలో 24.06 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 22.66 శాతం, కృష్ణాజిల్లాలో 19.97 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 19.20 శాతం, నెల్లూరు జిల్లాలో 17.70 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.