ఈటెల ఒక్కడేనా?

629

అసైన్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది విచ్చలవిడిగా లక్షల కోట్ల విలువ చేసే ఎన్వోసీ లు ప్రభుత్వమే ఇచ్చింది. ఇవాళ ఈటల  ఒక్క డే అక్రమాలకు పాల్పడినట్లు చూపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది, వేల ఎకరాలు అన్య క్రమంగా  దోచుకున్నారు. వాళ్లంతా దోషులు కారా? వాళ్లకు లేని శిక్ష ఈ ఒక్కడికే ఎందుకు? వారందరి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే , అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కి గురి అయిన వాటిలో భాగస్వాములే.  అసైన్డ్ భూములకు ఆయా నియోజకవర్గంలో ఆర్డిఓ , ఎమ్మెల్యే  చైర్మన్గా ఉన్నారు వారిని కాదని ఒక్క ఎకరా కూడా ఎవరు కబ్జా చేయరు.

కాబట్టి  ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో దోపిడీ జరిగింది.  అందులో అధికార పార్టీ వాళ్లే ఎక్కువ చేశారు.  తెలంగాణలో స్వతంత్రం వచ్చిన నుండి ఏ రాజకీయ పార్టీ   నాయకులు చెయ్యని దోపిడి, గత ఏడేళ్లుగా జరుగుతోందన్నది నిష్ఠుర నిజం.   కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక  ఎకరాలు విలువగల భూములు కాజేసి ప్లాట్లుగా అమ్మారు.   ఒక్కసారి ఆయా నియోజకవర్గ ప్రజలు, సమాచార హక్కు చట్టం కింద అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి అని దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుంది. నిజాలు బయట పడతాయి.

ఇవ్వాళ ఒక్కడి మీద కక్ష ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి  ఆరోపణలు ఉన్న ఎవరి పైన చర్య లేనిది… ఈ ఒక్కటి పైనే కక్ష సాధింపు ఎందుకు? తెలంగాణ ఉద్యమ  సమయంలో.. చెప్పులు కూడా కొనుక్కునే స్థోమత లేని వారు,  ఇవాళ వందల కోట్లకు వందల ఎకరాల భూములు గ్రేటర్ కమ్యూనిటీలో ఇల్లు కమర్షియల్ కాంప్లెక్సులు ఎక్కడ చూసినా పా మౌస్ లు..  ఎక్కడి నుండి వచ్చాయి?
వీరందరి పై సిట్టింగ్ జడ్జిల ద్వారా విచారణ జరపాలి. ఇవాళ హైదరాబాద్ నగరంలో కొంపల్లి ప్రాంతంలో ఒక వంద 80 ఎకరాల కస్టోడియన్ భూములు ఎక్కడ పోయినయి? కస్టోడియన్ అంటే దేశ విభజనలో పాకిస్థాన్కు వెళ్లిపోయిన వారి భూములు.   వెయ్యి కోట్ల ఆస్తులూ లూటీ జరిగింది.  ఇందులో బడా బడా నాయకులు అధికారులు ఉన్నారు.  ఎక్కడ చూసినా  భూములకు… మిల్ట్రీ భూములకు… ఫ్రీడమ్ ఫైటర్ భూములకు. ఎండోమెంట్ భూములకు.. లవన్ పటాలకు..  కుంట శిఖరాలకు.. చెరువుల్లో కుంటల్లో మునిగిపోయే భూములకు ఇండస్ట్రీ జోన్లకు వీటన్నిటికీ సెక్రటేరియట్ నుంచి ఎన్వోసీ లు ఎక్కడి నుండి వస్తున్నాయ్.   ఇది అంతా ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? కెసిఆర్ కు తెలియదా? ఒక్క ఎన్వోసీ ఇస్తే కోట్లాది రూపాయలు దండు కుంటున్న అధికారులు ఎక్కడ ? ఇది అంతా ప్రభుత్వానికి తెలియదా ? ప్రభుత్వం లో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వ అధికారుల అక్రమ ఆస్తులను వెంటనే జప్తు చేయాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులపైన కూడా చర్యలు తీసుకొని ప్రజలకు చెందే విధంగా చట్టాలు చేయాలి.

                                                                              –  పెంజర్ల మహేందర్ రెడ్డి
                                                                         (  ఓసి సంఘం  జాతీయ అధ్యక్షులు)