కరోనాతో గోపాలపురం వీఆర్వో బుల్లబ్బులు మృతి

367

ముమ్మిడివరప్పాడులో విషాద ఛాయలు
సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
నివాళి అర్పించిన రెవెన్యూ ఉద్యోగులు

రావులపాలెం మండలం గోపాలపురం వీఆర్వో ఇరగవరపు వెంకటేశ్వరరావు (బుల్లబ్బులు) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా చికిత్స పొందుతూ కోలుకున్నారు. అయితే తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. దివంగత వెంకటేశ్వర్లు.. టీవీ 5 మూర్తి, ది పయనీర్ తూర్పు గోదావరి స్టాఫ్ రిపోర్టర్ డిహెచ్‌వి సాంబశివరావుకు స్వయంగా బావ. రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు ఆయన స్వగ్రామం కాగా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాలకు ఆయన వీఆర్వోగా పనిచేసారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతితో ముమ్మిడివరప్పాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తపేట ఎమ్మెల్యే, ఏపి పియూసి ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి బుల్లబ్బులు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వీఆర్వో బుల్లబ్బులు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రావులపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్ద బుల్లబ్బులు చిత్ర పటానికి కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్ఏలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ తహసీల్దార్ జి.గోపాలరావు, ఏం.ఆర్.ఐ ఇబ్రహీం, సీనియర్ అసిస్టెంట్ హుస్సేన్, ఏఆర్ఐ బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, విఆర్వో సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మీపతి, వీఆర్వోలు రవిశంకర్, విశ్వనాధం, మీరా, వెంకటేశ్వరరావు తదితర వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు