దేశం వెలిగి పోతోంది…

462

అవునుకదా నా దేశం వెలిగిపోతోంది
శవాల చమురు దీపాలతో
మిన్నంటిన మూగ రోధనలతో
నా దేశమే స్మశాన మై పోయింది
ఏం పాపం చేశామని
ఈ గుండెను బండలు చేసుకోవాలి

మీ అధికార దాహం కోసం
ఈ సమయంలో ఎన్నికలా?
మీ మతపిచ్చి కోసం
ప్రభంజనంలా కుంభమేళలా?

ఏం బావుకుందామని
ప్రజలను గొర్రెలు చేశారు
ఏం మూటకట్టుకుందామని
దేశాన్ని బూడిద చేశారు?

మీ కోసమే గొంతు చించుకొన్న
ఆగొంతులు ఆక్సిజన్ లేక
ఆశ నిరాశలతో పోరాడుతున్నాయి
మీ కోసం చపట్లు కొట్టిన చేతులు సాయంకోసంఎదురుచూస్తున్నాయి

ఒకసారి బీభత్సవం చేసిన కరోనా
మరోసారివిజృంభిస్తుందిఅనితెలిసికూడా ఏమిపట్టని పాలకులారా!
అమాయకుల బలిపీఠంపైనిలిచి
భుజాలు చరుచుకోండి..
ఈ దేశం వెలిగి పోతోందని

టీకా ఇక్కడ తయారయితే ఇక్కడ
ప్రజలకు లేకుండా ఎగుమతులా?
అకీజన్ అవసరమవుతుంది అని
తెలిసి  ఎన్నికలకే తప్ప ప్రాణాలకు
ప్రాధాన్యతనివ్వని మహానానేతలం

జనం పిట్టల్లా రాలి పోతున్నారు
పార్థివదేహాలు అగ్నికోసం ఆరాట పడుతున్నాయి
జనం కన్నీటి రోధనతో
ఉప్పనై దేశమే మునిగిపోయింది

ఈ దేశం ఎప్పుడో వెలిగిపోయింది
ఇప్పుడే కన్నీటినితోమునిగిపోతోంది

(కరోనాతో మరణించిన లక్షల జనానికి, గుండెలు పగిలేలారోధిస్తున్న కోట్ల హృదయాలకు ఈ “కవిత”అంకితం)

        -Dr. m. a. k. భీమారావ్
                                                                                ( కవి.–సామాజికవేత్త)