విడాకులు తీసుకుంటున్న బిల్ గేట్స్ దంపతులు

281

బిల్ గేట్స్ దంపతులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.  ఈ విషయాన్ని బిల్ గేట్స్ దంపతులు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  తాము విడిపోయినా, బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం విడిపోదని, ఇద్దరం కలిసి కట్టుగానే ఫౌండేషన్ ను నడిపిస్తామని తెలిపారు.  మైక్రోసాఫ్ట్ ను  ఏర్పాటు చేసిన తరువాత 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు.  ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా గేట్స్ లు వివాహం చేసుకున్నారు.  54  బిలియన్ డాలర్ల విలువైన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు.  విడిపోయిన తరువాత కూడా ఈ ఫౌండేషన్ ను ఇద్దరు కలిసి ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.