కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల.అందుకే…?

372

ఈటల పేరు ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ లో  తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లాలో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీదకు వచ్చింది. అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి  వీలు ఉండదు. పట్టభూముల పక్కకి అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్ భూములను మార్కెట్ రేట్ ప్రకారం కొనవచ్చు. ఈటల రాజేందర్ గతంలో ఇదే అంశాన్ని కేసీఆర్ కు,సీఎం ఓ అధికారి నర్సింగ్ రావు కు చెప్పినట్లు ఈటల చెప్పారు. ఈటల అసైన్డ్ భూములను న్యాయ బద్ధంగా కొనుగోలు చేశారని చెప్పుతున్నారు. గతంలో కేసీఆర్ ఆస్తులు ఎంత ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత. కేటీఆర్ 111 జీవో ను ఉల్లఘించి జాన్వడలో భూమి ని అక్రమించుకుంటే విచారణ లేదు. మల్లారెడ్డి,ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి పైన విచారణ లేదు చర్యలు లేవు.

నిఖార్సయిన తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్.అందుకే ఆయనపై ఆరోపణలు బయటకు వచ్చాయి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళ నుండి ఈటల,హరీష్ అండగా నిలిచారు. మిగతా వాళ్ళందరూ బిటి బ్యాచ్. కొడుకు,బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. 2004లో కేసీఆర్ మంత్రి పదవి చెప్పటాక కేటీఆర్,కవిత తెలంగాణకు దిగుమతి అయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే… కరోనా సమయంలో ఈటలా పని చేస్తున్నారు. విచారణ అధికారులు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందిచాలి కానీ మీడియాకు నివేదిక ఇస్తున్నారు. కలెక్టర్ ఒక్క నిర్ణయానికి వచ్చాక ప్రభుత్వం ఎందుకు?. రిటైర్ కలెక్టర్ ధర్మారెడ్డి భూములను ఈటల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు అన్నారు. మరి అప్పుడు ధర్మా రెడ్డి ఏమి చేశారు. ధర్మారెడ్డి పైన ఏసీబీ కేసులు ఉన్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర బలవంతంగా కేసీఆర్ భూములను తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ పెద్ద బావి తవ్వితే చుట్టు పక్కల బావిలు ఎండిపోయాయి. ధరణి వెబ్ సైట్ కేసీఆర్ పేరు మీద ఎర్రవెల్లిలో భూములు లేనట్లుగా చూపిస్తున్నాయి. ఎందుకు కేసీఆర్ భూముల దాపరికం. కేసీఆర్ కుటుంబం గతంలో ఆస్తులు ఎంత?ఇప్పుడు ఎంత బహిరంగ విచారణకు రావాలి. మంత్రి మల్లారెడ్డి బెదిరింపు వాయిస్ మీద ఎందుకు విచారణ జర్పించడం లేదు. ఈటల రాజేందర్ పదవి కోసం వేంపర్లు ఆడే వ్యక్తి కాదు.