‘థ్యాంక్యూ బ్రదర్’ ట్రైలర్!

615

గర్భవతి అయిన ఓ మహిళ. జీవితం పట్ల బాధ్యత లేని ఓ కుర్రాడు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దాని పర్యవసానమే ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల తెలుగులో బాగానే వస్తున్నాయి.  రొటీన్ ఫార్ములాకు భిన్నమైన సినిమా ఇదని 1.27 నిమిషాల ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, పెర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలూ ఇప్పటికే కొన్ని సినిమాలలో చేసి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఇది అదే కోవకు చెందిన చిత్రంగా కనిపిస్తోంది. ఇక విరాజ్ అశ్విన్ కొన్ని సినిమాలలో నటించినా, తనదైన గుర్తింపును ఇంకా పొందలేదు.  ఇతర ప్రధాన పాత్రాలలో ‘కార్తీక దీపం’ ఫేమ్ అర్చనా అనంత్, అనీశ్‌ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, హర్ష నటించారు. ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆహా’ ద్వారా మే 7న విడుదల చేస్తున్నారు. మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి రమేశ్ రాపప్తి దర్శకత్వం వహించాడు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూర్చాడు.