ముంబైలో వ్యాక్సినేషన్ కు బ్రేక్

144

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  మహారాష్ట్రలో రోజువారీ కేసులతో పాటుగా మరణాల సంఖ్య సైతం భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో మే 15 వరకు లాక్ డౌన్ విధించినట్టు వార్తలు వస్తున్నాయి.  కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కరోనా మహమ్మారి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.  మరోవైపు వ్యాక్సినేషన్ ను వేగంగా నిర్వహిస్తున్నారు.  అయితే, ముంబైలో వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.  మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.  ఈరోజు నుంచి మూడు రోజులపాటు అంటే మే 2 వ తేదీ వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలుగుతున్నది.  వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తే ప్రజల్లో ఆందోళనలు  నెలకొంటాయని, ఆ భయంతో చాలా మంది మరణిస్తారని నిపుణులు చెప్తున్నారు.