సర్కార్ పై హై కోర్టు అసంతృప్తి

476

తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది.   ఉదయమే కేసు ఉన్నా మధ్యాహ్నం వరకు సమయం కోరిన ప్రభుత్వం..  మధ్యాహ్నం తర్వాత కూడా నిర్ణయం వెల్లడించలేదు అడ్వాకేట్ జనరల్.   మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు..నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది.  సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏజీ. ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం మా ఉద్దేశం కాదని..  భోజన విరామం తర్వాత చెప్పాలని ఏజీకి హైకోర్టు సూచనలు చేసింది..