క్షేత్రస్థాయిలో ఇంటింటి పరిశీలన

363

ఏలూరు, ఏప్రిల్ 30 (న్యూస్‌టైమ్): క్షేత్రస్థాయిలో ఇంటింటిని వైద్య సిబ్బంది తప్పనిసరిగా పరిశీలించడంతో పాటు, అనుమానిత లక్షణాలువున్నవారిని ఎక్కడికి తరలించాలో పక్కాగా నిర్ణయం జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక వీడియోకాన్ఫరెన్సుహాలు నుండి జిల్లా కలెక్టర్ కోవిడ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీవోలు, అందరు మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపిడిఓ, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎం, సచివాలయ హెల్త్ కేర్ అసిస్టెంట్లతో వెంటనే సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే మున్సిపల్ కమీషనర్లు 4, 5 వార్డుల సచివాలయను కలిపి సిబ్బందికి, మెడికల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం నాటికి సమావేశాలు పూర్తికావాలన్నారు.

సమావేశంలో కొవిడ్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలతో పాటు, 104 కాల్ సెంటర్, ఫీవర్ సర్వేలో గుర్తించిన వారికి చికిత్స, కొవిడ్ బాధితులను గుర్తించిననాటి నుండి తీసుకోవాల్సిన చర్యలపై విపులంగా తెలియచేయాలన్నారు. ఫీవర్ సర్వే 97 శాతం పూర్తి అయిందని, అనుమానిత లక్షణాలు వున్నవారికి హోమ్ ఆసోలేషన్ కిట్స్ అందచేయడం జరిగిందన్నారు. అనుమానిత లక్షణాలు వున్న ప్రతి ఇంటిని ఎఎన్ఎం ఆక్సిమిటి సందర్శించాలన్నారు. పల్స్ తక్కువగా వున్నవారిని వెంటనే ఎక్కడికి తరలించాలి అనేది డాక్టర్లు/ఆర్ఆర్ట్ టీమ్ పక్కాగా నిర్ణయించాలన్నారు. హోమ్ ఐసోలేషన్, ట్రిపుల్ సీ సెంటర్, ఆస్పత్రిలోనా అనేది తెలియచేయాలన్నారు. మనకు వున్న వ్యవస్థను వినియోగించుకోవడంలో అధికారులు దృష్టి సారించాలని విఆర్ఓలు, పంచాయితీ సెక్రటరీలు తదితరులు ద్వారా ఆయా గ్రామాలలో ఎవరు లక్షణాలు కలిగివున్నారు అనేది సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మనంచేసే పని మనస్సుతో ఆలోచిస్తే కొవిడ్ వ్యాప్తిని అరికట్టడం పెద్ద కష్టమైన పనికాదన్నారు.

ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రతి పీహెచ్‌సీని సందర్శించాలన్నారు. ఒకొక్క నియోజకవర్గంలో రెండు అంబులెన్సులు చొప్పున 30 అంబులెన్సులను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. డాక్టర్లు నిర్ణయించిన ప్రదేశానికి కొవిడ్ బాధితులను అంబులెన్సుల ద్వారా తప్పక పంపాలన్నారు. ప్రతి కొవిడ్ కేర్ సెంటర్‌లో హెల్ప్ డెస్క్, బెడ్స్, ట్రైయాజింగ్ సెంటర్ ఏర్పాటులను ఫోటోలతో సహా నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. అవసరమైన ఆస్పత్రిలలో సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి ఆసుపత్రిలోని సీసీ కెమేరాకు కలెక్టరేట్‌లోని మానిటర్ అనుసంధానం చేయడం జరుగుతుందని ఇక్కడ నుండే రోజుకు రెండుసార్లు అటెండెన్సు తీసుకోవడం జరుగుతుందన్నారు.

విధులు నిర్వహింస్తున్న నోడల్ అధికారి సీసీ కెమెరా ద్వారా అటెండెన్సు చెప్పాల్సివుంటుందన్నారు. ప్రతి ఆసుపత్రి పేరు, బెడ్స్, హెల్ఫ్‌డెస్క్ కనపడెలా సీసీ కెమెరాలు వుండలన్నారు. డాక్టర్ ఏ సమయంలో రౌండ్‌కు వెళతారు అనేది ఖచ్చితంగా బోర్డు మీద నమోదుచేయాలన్నారు. ఆయా సమయాలలో డాక్టర్లు, ఎఎన్ఎంలు రౌండ్స్‌కు వెళ్ళినది లేనిది ఏలూరునుండే పరిశీలించడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) భీమవరంలోని ట్రిపుల్ సీ సెంటర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిందిగా తెలిపారు. అక్కడ శానిటేషన్ ఎలా జరుగుతుంది, భోజనం ఎలా పెడుతున్నారు, ట్రిపుల్ సీ సెంటర్‌కు వెళ్ళే రోడ్డు ఎలావుంది తదితర అంశాలను పరిశీలించాలన్నారు. విపత్కర పరిస్థిలలో ప్రతి ఒక్కరు తమ వంతు విధిగా విధులు నిర్వహించి ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్లు కె.వెంకట రమణా రెడ్డి, హిమాన్సు శుక్లా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎవిఆర్ మోహన్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె.ఎం.సునంద, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, ఇన్‌ఛార్జి డిఆర్ఓ జె.ఉదయ భాస్కర్, డిటిసి సిరి ఆనంద్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎ.వి.శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.