బెంగాల్‌లో చివరి దశ పోలింగ్…

353

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు చివరి దశ పోలింగ్ జరుగుతున్నది.  మొత్తం 294 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి.  కాగా నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.  మొత్తం 35 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 2 వ తేదీన వెలువడబోతున్నాయి.  కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.