నృత్యాన్ని గుర్తించిన రోజు…

312

న్యూయార్క్, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీచే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ ఇచ్చింది. 1760లో ప్రచురితమైన ప్రముఖ రచన రచయిత, ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ(1727-1810) జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆ రోజును అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానితులవుతుంటారు.

ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది. యూనిస్కో నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో ఇప్పటివరకు పాల్గొన్న, సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్, అక్రం ఖాన్, అన్నె తెరెసా దె కీర్ స్మేకర్‌లు. ఈ దినం లక్ష్యం నృత్య కళారూపం ప్రపంచీకరణను చేధించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులు అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయట ప్రపంచ నృత్య కూటమి, దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్‌లోని యూనిస్కోలోనూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటారు.

అంతర్జాతీయ నృత్య కౌన్సిల్, యునెస్కో అధ్వర్యంలో నృత్యానికి ప్రోత్సాహం అందిస్తుంది, నృత్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆ సంస్థ అధ్యక్షుని ప్రసంగంతో ప్రొమోట్ చేస్తుంది. ఈ సంస్థ నృత్యం అనేది మానవ సంస్కృతిలో అంతర్బాగమని భావిస్తుంది. 2003లో జరిగిన అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో అధ్యక్షుడు సందేసం ప్రకారం. 2005లో ఈ నృత్య దినోత్సవం ప్రాధమిక విద్యపై తన దృష్టి సారించింది. అన్ని నృత్య వ్యవస్థలు విద్యా మంత్రిత్వశాఖలకు అన్ని పాఠశాలలలో వ్యాసరచన పోటీలను, చిత్రలేఖన పోటీలను, వీధులలో నృత్య కార్యక్రమాలను మొదలగు వాటిని నృత్యం పై నిర్వహించి ప్రతిపాదనలు పంపాలని కోరింది. 2006లో సీఐడీ అధ్యక్షుడు వివిధ సామూహిక సంస్థలలో చేరడానికి విముఖత చూపిస్తున్న నాట్యకారులను ఉద్దేశించి, వారు చేరుటకు అయిష్టత చూపుటకు ముఖ్య కారణం నృత్య సమాజంలో గుర్తింపు లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు.

2007లో నృత్య దినోత్సవం పిల్లలకు అంకితం చేయబడినది. 2008లో అంతర్జాతీయ నృత్య కౌన్సిల్ అధ్యక్షులు ఆల్కిస్ రాఫ్టిస్ ఒక ఇ-మెయిల్‌ను పంపడం జరిగినది. దానిలో భాగం… ప్రభుత్వాలు, ప్రాయోజకులు, మీడియాలు ఈ సంవత్సరం ముఖ్యపాత్ర పోషించాలని, ప్రభుత్వాలు (జాతీయ, ప్రాంతీయ, లోకల్), ప్రాయోజకులు (ప్రైవేటు, పబ్లిక్), మీడియా (వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, రేడియో, టీవీ) అనే మూడు వ్యవస్థలు కళా రంగాన్ని ప్రభావితం చేయగల ముఖ్య కారకాలని తెలిపారు. నృత్య కళాకారులు వ్యక్తిగతంగా సంప్రదించేందుకు కష్టపడుతుంటే వారిని సరైన మార్గాన్ని సూచిస్తున్నాం… మార్గమేమంటే అన్ని స్థాయిలలో సీఐడీ విభాగాలను ఏర్పాటు చేయడమే… 2010లో అంతర్జాతీయ నృత్య కౌన్సిల్ అధ్యక్షులు ఆల్కిస్ రాఫ్టిస్ ఈ విధంగా రాసారు.