ధూళిపాళ్ల కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

221

ధూళిపాళ్ల నరేంద్ర ను ఏసీబీ అధికారులు ఇటీవలే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  సంగం డైరీలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  కాగా, దీనిపై దూళిపాళ్ల నరేంద్ర ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  కాగా, క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  దూళిపాళ్ల నరేంద్ర కేసులో విచారణ కొనసాగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.  మే 5 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.  దీంతో ఏసీబీ అధికారులు అఫిడవిట్ ను దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.