ప‌రీక్ష‌ల ర‌ద్దుకి హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం

171

ఏపీలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. క‌రోనా సెకండ్ వేవ్ మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న ద‌శ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నుకుంటున్న ప్ర‌భుత్వానికి ఎన్ని విన‌తులు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో విద్యార్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు పిల్ దాఖ‌లు చేశారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న స‌మయంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం విద్యార్థుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డమేన‌ని, ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌డ‌మో, వాయిదా వేయ‌డ‌మో చేయాల‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్స‌ప్ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు లోకేష్‌. దీనికి ల‌క్ష‌లాది మంది ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని సందేశాలు పంపారు. అలాగే ఆన్‌లైన్లో నిర్వ‌హించిన టౌన్‌హాల్ మీటింగ్‌లో పిల్ల‌ల ప్రాణాలే ముద్దు, ప‌రీక్ష‌లు వ‌ద్ద‌నే అంశంపై న్యాయ‌పోరాటం చేయాల‌ని మెజారిటీ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు క‌రోనా సెకండ్‌వేవ్ ప‌రిస్థితులు వివ‌రిస్తూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ బుధ‌వారం హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు.