పంతాలు…పట్టింపులకు పోవద్దు…పరీక్షలు రద్దు చేస్తారో…వాయిదా వేస్తారో మీ ఇష్టం..

289

– మా సలహాలు నచ్చకపోతే విద్యార్థులు, యూనియన్ల అభిప్రాయం తెలుసుకోండి.. మీ పార్టీ నేతలను కూడా ఒక మాట అడిగి నిర్ణయం తీసుకోండి…
– భవిష్యత్ తరమైన విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆటలాడుకోవద్దు…
– విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి విజ్ఞప్తి..

రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతతో ఎప్పుడూ ఊహించని పరిణామాలు..వందేళ్ల చరిత్రలో వినని పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి..ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల తేదీలు ప్రకటించి పంతాలు, పట్టింపులకు పోవడం తగదు..
గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది..30 ఏళ్ల లోపు యువకులు కూడా చనిపోతున్నారు..నెల్లూరులో పరిస్థితి తీవ్రతను చూస్తున్నాం..స్థానికంగా బెడ్లు లేక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు పోయి లక్షలకు లక్షలు బిల్లులు కట్టినా ప్రాణాలు నిలవడం లేదు..కోవిడ్ బాధితులకు కావల్సిన ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు, రెమిడెసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై చాలా బాధ్యత ఉంది..ఇది ఆషామాషీ విషయం కాదు..వ్యాక్సినేషన్ వేయడం చాలా పెద్ద సవాల్…దానిని స్వీకరించండి..
మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనడం కరెక్ట్ కాదు..దేశ వ్యాప్తంగా తెలంగాణ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేశాయి..మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ , ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు వాయిదా వేశాయి..కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈ పరీక్షలను రద్దు చేసింది..ప్రతిష్టాత్మక జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసింది.. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎంబీఏ, ఎంసీఏ, ఎల్.ఎల్.బీ, బీఈడీ, పీజీ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
 విద్యావంతుడైన మంత్రి ఆదిమూలపు సురేష్  గారూ.. మీకు ఎందుకింత మొండి పట్టుదల? ఏపీలో 6 లక్షల మంది టెన్త్ విద్యార్థులు, 10.60 లక్షల మంది ఇంటర్ విద్యార్థులున్నారు…50 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది కూడా పరీక్షల విధులకు హాజరుకావల్సివుంటుంది.. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చే తల్లిదండ్రులు, డ్రైవర్లు ఉంటారు..కొన్ని లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదముందని తెలిసినా ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు..
దేశంలోని అనేక రాష్ట్రాలు, యూనివర్సిటీలు వాయిదా వేసినప్పుడు మీరు ఎందుకు పట్టింపులకు పోతున్నారు..అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు,. రాష్ట్రంలో మీరు చెప్పినవిధంగా పరిస్థితి లేదు..మీరు చెప్పినవి జరగడం లేదు..సకాంలో వైద్యం అందక జర్నలిస్టులే చనిపోతున్నారు…నెల్లూరు జిల్లాలో పెళ్లకూరు రిపోర్టర్ సత్యనారాయణ వైద్యం అందక జీజీహెచ్ రిసెప్షన్ లోనే తుదిశ్వాస విడిచారు..
జర్నలిస్టులు నెల్లూరులో కొన్ని బెడ్లు కేటాయించాలని కోరుతున్నా ఇప్పటికి స్పందన లేదు..రెండేళ్లుగా వారికి అక్రిడిటేషన్లు జారీ చేయలేకపోయారు..ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోల్పోయారు..కోవిడ్ మృతుల ప్రకటన కూడా చాలా గందరగోళంగా ఉంది..
ఉదాహరణకు నెల్లూరులో ముగ్గురు, నలుగురు, ఆరుగురు చనిపోయారని అధికారికంగా ప్రకటిస్తున్నారు..కానీ రోజుకు 20 నుంచి 25 మంది వరకు చనిపోతున్నారు..ఆ లెక్కలు కూడా సరిగా బయటపెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు..మొన్న 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే అధికారికంగా 1250 మాత్రమే అని ప్రకటించారు..లెక్కలు తగ్గించి చూపడం కాదు…వారి ప్రాణాలు కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోండి..ఎన్నికల్లో ఓటమి, గెలుపు విషయంలో కూడా లేనంత టెన్షన్ ఇప్పుడు అనుభవిస్తున్నా..
 ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కోవిడ్ బాధితులకు సాయం చేయడం, వారి బాగోగులు తెలుసుకునే విషయంలో ఒత్తిడితో గడుపుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి పట్టింపులు అవసరమా…విద్యార్థి యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఒక్కో జిల్లాలో వెయ్యి మంది విద్యార్థులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకోండి..నిష్పక్షపాతంగా అభిప్రాయసేకరణ జరిపితే 95 శాతం మంది వాయిదా వేయమని లేదా రద్దు చేయమని కోరుతారు.
ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని మమ్మల్ని కౌంటర్ చేయడం కాదు..కరోనాకు ఒక లేఖ రాయండి…దానిని టచ్ చేసి చూడండి…దాని పరిస్థితి ఏంటో చెబుతుంది…ఐదుగురు ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నే ఒక రౌండ్ వేశాను..మీరెంత అని రిప్లయి ఇస్తుంది..ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు..
కేంద్ర ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు విధించింది..రెండు సార్లు వ్యాక్సినేషన్ చేయించుకున్న వారిని, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉన్న వారినే ఏజెంట్లుగా అనుమతిస్తామని ప్రకటించింది.. మీరు ఎంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు టెస్ట్ చేయించి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు..ఎన్ని లక్షల టెస్టులు చేయించగలరు.ఒక్క రోజు కౌంటింగ్ కే సీఈసీ అనేక గైడ్ లైన్స్ ఇచ్చింది..లక్షల మంది విద్యార్థులకు రోజుల తరబడి జరిగే పరీక్షలకు ఏం చేయగలరు..
మీ చేతుల్లో లేనిదానికి మీరెందుకు ఆరాటపడుతారు..దయచేసి పంతాలకు పోవద్దు.. నిన్న ఒకటిన్నర సంవత్సర బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయారు…ఆస్పత్రిలో బెడ్ దొరక్క అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి..దయచేసి పరీక్షలు కాదు…ప్రజల ప్రాణాల కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోండి..వసతులు పెంచి ప్రాణాలు కాపాడండి…పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకోవద్దు.. దురదృష్టవశాత్తు పిల్లలు కోవిడ్ బారిన పడితే వారి కుటుంబం మొత్తం దాని బరినపడే ప్రమాదముంది పరీక్షలను వాయిదా వేస్తారో…రద్దు చేస్తారో…దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి..