కరోనా కష్టకాలంలో డాక్టర్ గా సేవలందిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

1004

కరోనా మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇళ్లలో నుంచి బయటకు కూడా రాకుండా ఉంటున్నారు.ప్రజా ప్రతినిధులు అయితే ఫామ్ హౌస్ లో ఉంటూ అత్యంత గట్టి సెక్యూరిటీ మధ్య నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి మా ప్రాణాలే ముఖ్యం మా కుటుంబ సభ్యుల ప్రాణాలే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యే లు అయితే పక్క రాష్ట్రాల్లో కాపురాలు పెట్టారు.కనీసం వారి నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు అందుబాటులో లేరు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని ధైర్యం చెప్పడానికి తన సొంత వాహనంకు మైక్ ఏర్పాటు చేసుకుని గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రజలకు కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వైద్యుడుగా కరోనా నివారణకు ఏ చికిత్స తీసుకోవాలి..? ఆక్సిజన్ శాతం తగ్గితే ఏమి చేయాలి? వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల జరిగే లాభాలు ఒక ఎంబిబిఎస్ డాక్టర్ కంటే ఎక్కువగా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతేగాకుండా మాస్కు ధరించే విధానం పైన కూడా ఆయన ప్రజలకు తెలియజేస్తూ, నేనున్నాను ధైర్యంగా ఉండండి అంటూ ఒక భరోసా ఇస్తున్నారు. కంగారు పడవద్దు.. ప్రతి దానిని కడుక్కుని తినండి అని ప్రజలకు తెలియజేస్తూ వ్యక్తిగతంగా గ్రామాల్లో తిరుగుతూ ఒక ధైర్యాన్ని నూరిపోస్తున్నారు .

ఒకవేళ కరోనా వస్తే అలాంటి వారి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి అని పూసగుచ్చినట్లు వివరిస్తూ ధైర్యం నూరిపోస్తున్నారు. అసలు టివిలో వార్తలు చూడాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ముందుకు వచ్చిన ఏకైక ప్రజా నాయకుడు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గత సంవత్సరం వీడియోలు కూడా ఈ సంవత్సరం జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని భయాన్ని సృష్టిస్తున్నారు. అలాంటి సమయంలో నేను ఉన్నాను.. నీకేం కాదని ధైర్యాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చిన ఏకైక నాయకుడు . ఆయన చేస్తున్న పర్యటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రచారానికి దూరంగా తనను నమ్ముకున్న ప్రజలకు అండగా ఉండాలని ఈ కరోనా కష్టకాలంలో కూడా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసి జాగ్రత్తలు చెప్తున్నారు.