చావు వార్తలు ఆపండి-మనో ధైర్యం నింపండి

489

ఇప్పుడు కరోనా కంటే.. ఆ వార్తలే సమాజానికి   మరింత ప్రమాదకరంగా మారాయి. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన వారి విషాదాలు చూపిస్తున్న మీడియా వార్తతో రోగులు బేజారెత్తుతున్నారు. వారి బంధువుల బాధలయితే మరీ దారుణం. కరోనాకు నివారణ, సూచనలు, చిట్కాలతో ప్రజల్లో వీలైనంత మనోధెర్యం నూరిపోయాల్సిన మీడియా, ఇప్పుడు ప్రజల్లో భయోత్పాతం నింపే ప్రచారసాధనమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని వెలుగులోకి తెచ్చి, సదరు ఆసుపత్రుల పేర్లు కూడా రాసి, చూపేందుకు భయపడుతున్న మీడియాకు.. ప్రభుత్వ ఆసుపత్రులే తేరగా దొరకుతున్నాయి. అరకొర సిబ్బంది, అతె్తరసు సౌకర్యాలు, చాలీచాలని బెడ్లతోనే నిరంతరం సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను ఒక్క మీడియా కూడా అభినందించకపోవడం బాధ్యతారాహిత్యం.

ప్రైవేటు ఆసుపత్రులపై అంత ప్రేమ ఎందుకంటే.. వాళ్లు ఇచ్చే అడ్వర్జైజ్‌మెంట్ల పాకేజీలు ఎక్కడ పోతాయేమోనన్న భయం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు లక్షలు గుంజుతున్నాయి. అసలు లక్ష రూపాయలు డిపాజిటు చేయనిదే చేర్చుకోరు. ఇంకొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఖాళీ అయితే, కొత్త పేషెంటును చేర్చుకోవాలంటే లక్షలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఆక్సిజన్ తీసేసి, కాసుల కోసం కొత్త పేషెంట్లకు బెడ్లు ఇస్తున్న కిరాతకాలు జరుగుతున్నాయి. అవి మీడియాకు కనిపించవు. వినిపించవు. ఒకవేళ కనిపించినా, యాడ్స్ మొహమాటంతో అవన్నీ తెరకెక్కవు. ఇది బహిరం రహస్యం! అవన్నీ చిన్నా, చితకా ఆసుపత్రులు కావు. సీఎం నుంచి ఎంపీల వరకూ పరిచయాలున్న కార్పొరేట్ ఆసుపత్రులే. అందుకే రోగుల్లో మానసిక ధైర్యం నింపాల్సిన మీడియా, భయపెట్టే వార్తలతో సామాజిక బాధ్యత విస్మరిస్తోంది. ఏం.. మీడియాకు సామాజిక బాధ్యత లేదా? మద్రాసు హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్లు.. ఏం ? మీడియా ఏమైనా మరో గ్రహం నుంచి పుట్టుకొచ్చిందా?
* * *
ఒక రైతు పొలం పని చేసుకొని చీకటి పడ్డాక ఇంటికి వస్తుండగా దారిలో కాళ్ల మీద ఎదో  ప డ్డట్టుగా అనిపించింది. మసక చీకట్లో తెల్ల తెల్లగ కన్పించిన దాన్ని చూసి.. పాము అనుకొని చేతికర్రతో నాలుగైదు దెబ్బలేసి పాము చచ్చింది అనుకొని, ఇంటికి పోయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. పాము కరవలేదు కానీ దానిని తాను చంపేసానని చెప్పాడు. కుటుంబ సభ్యులు ధైర్యంచెప్పి పడుకోమంటే ఆ రైతు భయం భయంగనే ఆ రాత్రి నిద్రపోయాడు. తీరా తెల్లారాక చూస్తే చనిపోయి ఉన్నాడు.
కుటుంబ సబ్యులు ఏడ్చి ఏడ్చి.. పాము కరిచిందేమో చూద్దామని రాత్రి రైతు నడిచిన దారిలో వెతికారు. చచ్చిన పాము కనపపడలేదు, కానీ చనిపోయిన రైతు నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు వాళ్లకు ఆ దారిలో దొరికింది.

తన వెండి నడుము గొలుసు జారి తన కాళ్లమీద పడ్డట్టుంది. ఆ రైతు దాన్నే పాము అనుకొని భయంతో ఆలోచించి ఆలోచించి నిద్రలోనే చనిపోయాడు‌. భయం ఎంత చెడ్డదో ఈ కథ స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు అచ్చు ఇదే పరిస్థితి కరోనా విషయంలోనూ జరుగుతున్నది.

99% రికవరీ రేటును వదిలి కరోనాను భూతద్దంలో చూపెడితే ఎట్లా??

కరోనా చావులల్లో భయం 90% , ఇతర శరీర రుగ్మతల వలన 10% అన్నది 100% వాస్తవం.
ఇక ఇలా భయాన్ని వ్యాపింపచేస్తున్నదంతా కూడా మీడియానే కావడం గమనార్హం, అందునా తెలుగు మీడియా అయితే మరీను. కనుక ప్రభుత్వం వైద్యంతో పాటు ఈ మీడియాను అదుపు చేయడంపై కూడా ద్రుష్టి సారిస్తే మంచిది, అప్పుడు సమస్య 90% తగ్గుతుంది, లేకుంటే హాస్పిటల్లపై ఇంకా ఒత్తిడి పెరుతుంది, అలాగే మరణాలు కూడా.

“అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చనిపోతే.. ఏమీ తెలియనోడూ ఏకాదశినాడు సచ్చిండంట !” అచ్చం అట్లాగే కరోనా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ తమకు తెలియకుండానే భయానికి గురౌతున్నవారు రు చాలా మందివున్నారు. కరోనా గురించి పెద్దగా అవగాహన లేనివాళ్లు అలాగే కరోనా వార్తలు అసలే పట్టించుకోనోళ్లు.. హాయిగా పని చేసుకొని ఏదైతే అదే అవుతుంది అని మొండిగ ఉన్నోళ్లకు ఏమవట్లేదు.
తలలో భయాన్ని నింపితే అది కెలుకుతూనే  ఉంటుంది. దయచేసి కరోనా (చావు) వార్తలు పోస్ట్ చేయకండి.