హాట్స్ ఆఫ్ ఆదిత్య

287

భీమిలికి చెందిన యువ ఫిజియోథెరపిస్ట్ ముమ్మిడి శెట్టి ఆదిత్య మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల వరుసగా ఎందరో కరోనా బాధితుల కు, వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. తాజాగా బుధవారం సంగి వలస ఎన్నారై లో కొవిద్ తో మృతి చెందిన లక్ష్మి సుధాకర్ (46) అనే మహిళకు దగ్గరుండి అంత్య క్రియలు నిర్వహించారు. భయపడి ఎవరూ రాలేని తరుణంలో ఏమి చేయాలో పాలుపోక మృతురాలి చెల్లి ..తన అక్క అంత్య క్రియలు ఎలా చేయాలో అని అటు అధికారులను, ఇటు హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రాధేయపడినా ఎవరూ కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. విషయం తెలుసుకున్న ఆదిత్య వారికి అండగా వెళ్లి…అంతిమ యాత్ర వ్యానులో మృత దేహాన్ని భీమిలి కి తెచ్చి స్వయంగా దగ్గరుండి ఆఖరి లాంఛనాలు జరిపించి మానవతను చాటారు. మృతురాలి చెల్లి, భర్త తో పాటు ..ఉదయం నుంచి సాయింత్రం వరకు దగ్గరుండి …ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సాయం చేసిన ఆదిత్య .. ఈ ప్రాంతీయుల పాలిట దేవుడిలా నిలుస్తున్నారు. శభాష్ ఆదిత్య