గోవాలో లాక్‌డౌన్…

242

క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు క్ర‌మంగా రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట ప‌డుతున్నాయి.లాక్‌డౌన్‌, మినీ లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ లాంటి చ‌ర్య‌ల‌కు దిగుతున్నాయి.ఈ నేప‌థ్యంలో గోవా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది గోవా స‌ర్కార్.ఈ నెల 29వ తేదీ రాత్రి 7 గంట‌ల నుంచి మే 3న ఉద‌యం వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.అయితే, ఈ స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర సేవ‌లు, వివిధ‌ పరిశ్ర‌మ‌లకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు పేర్కొంది.అత్య‌వ‌స‌ర వ‌స్తువుల ర‌వాణా కోసం రాష్ట్ర‌ స‌రిహ‌ద్దులు తెరిచే ఉంటాయ‌ని స‌ర్కార్ వెల్ల‌డించింది.. కానీ, ప్ర‌జార‌వాణా మాత్రం మూత‌ప‌డ‌నుంది..