ప్రయాణికులపై మరో రెండు దేశాలు నిషేధం…

102

భారత దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.  దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.  దీంతో భారత ప్రయాణికులపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.  ఇప్పటికే ఈ లిస్ట్ లో సింగపూర్,  కెనడా, న్యూజిలాండ్ చేరగా తాజాగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్ లు చేరాయి. భారత్ లో ఉన్న విదేశీయులు 14 రోజులు ఇటలీకి రాకుండా నిషేధం విధించాయి.  అదే విధంగా భారత్ లో ఉన్న ఇటలీ దేశస్తులు సొంత దేశం రావొచ్చని అయితే నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని పేర్కొన్నది.  అదే విధంగా ఇటలీ వచ్చిన తరువాత 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అని ఇటలీ ఆరోగ్యశాఖ పేర్కొన్నది.