బోలో.. క్యా బోల్తా హై..!

578

కరోనా వచ్చి ఏడాది దాటినా..

◆ కొత్తగా హాస్పిటల్స్ కట్టింది లేదు..

◆ వేసుకునేందుకు వాక్సిన్ లు లేవు..

◆ ఆసుపత్రుల్లో పడకలు లేవు..

◆ అవసరమైన మెడిసిన్స్ లేవు..

◆ చివరకు ప్రాణాలు నిలువుకునేందుకు ఆక్సిజన్ కూడా లేదు..

◆ టెస్టు రిపోర్టులు నమ్మశక్యంగా లేవు..

◆ ప్రైవేట్ దోపిడీకి అడ్డంకి లేదు..

◆ తగిన సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది లేరు..

మరేముంది మన దేశంలో..
◆ దురదల్లాంటి మేధావులున్నారు
◆ ప్రజలంటే పట్టని పాలకులున్నారు..
◆ క్షతగాత్రమైన ప్రజాస్వామ్యముంది..
◆ క్వార్టర్ సీసాకు, బిర్యానీ పొట్లానికి ఓటమ్ముకునే మనమున్నాం..
◆ ప్రజాప్రతినిధుల్ని పరమాత్మను చేసే మూర్ఖత్వం ఉంది..
◆ అమ్ముడుపోయే అభ్యుదయముంది.
◆ చొంగకార్చే జర్నలిజం ఉంది..
◆ మతాల కులాల కుంపట్లున్నాయి..
◆ సినిమా, క్రికెట్ పట్ల ముదిరిపోయిన పిచ్చి ఉంది..
◆ దిగజారడంలో ‘నువ్వా..నేనా’ అనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి..

వావ్..! మేరా భారత్ మహాన్?!
అన్ని చోట్లా అంధా కానూన్..!

                                                                                                                  –ప్రసాదరావు