నేను..నాదేశం!

614

పవిత్ర భారతదేశం…!
వసుధైక కుటుంబం…!
భిన్నత్వంలో ఏకత్వం…!

ఒకనాడు సాంకేతిక విజ్ఞానం అందుబాటులో లేదు.
శతాబ్దాల నాడు..మశూచి..కలరా..ప్లేగు..విపత్తులు సంభవించినపుడు…నిస్సహాయంగా భరించారు.

కుష్టు..మలేరియా..ఫైలేరియా ..ఫ్లూ..చికెన్ గున్యా..ఆఖరుకు డెంగ్యూ ని కూడా ఎదుర్కున్నారు.
కొన్ని రోగాల జాడ లేకుండా చేయగలిగారు.

ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి..!
గత సంవత్సరం ముందుగా జాగ్రత్త పడితే ముప్పునుండి తప్పించుకోగలిగేవారము.
అసమర్ధ..చేతగాని..వివేకం లేని పాలకుల వల్ల..ముప్పు ముట్టడించింది.

దాని నుండి కూడా లబ్ది పొందటానికి ప్రయత్నాలు చేసారు.

సంక్షోభ లాభం చిక్కింది.

అప్రయోజకులైన పాలకులు తప్పించుకున్నారు.
వైరస్ ఉధృతి తగ్గిందని స్వకుచ మర్ధనం చేసుకున్నారు.

వైరస్ విరామం ఇచ్చింది.

ఆ సమయంలో చేదు అనుభవాలనుండి పాఠాలు నేర్చుకోకుండా..!
ఎలక్షన్స్..సెలక్షన్స్..!
రాజకీయం..ఒక్కటే వారి ప్రాధాన్యం..!
రాజ్యాధికార కాంక్ష..అధికార విస్తరణ కాంక్ష..!
ఇతర దేశాలకు వ్యాక్సిన్ల పందేరం..!

దేశంలో..మందులు కొరత..బెడ్లు కొరత..ఆక్సిజన్ కొరత..!

కాని మరణమృదంగం వినాల్సి రావటం దురదృష్టకరం.

ఆర్ధికంగా..హార్ధికంగా..ఆరోగ్యపరంగా..అన్ని విధాల సతమత మవుతున్నాడు సామాన్యుడు.

కరోనా మాత్రం వాడు వీడు అనే తేడా లేకుండా కబళించేస్తుంది.

మత ప్రదర్శనలు..పొలిటికల్ ర్యాలీలు.బాధ్యత లేకుండా రాజకీయపక్షాలు నిర్వహిస్తుంటే..సగటు జీ వి ధీమా గా ఉంటాడు.

మాల్స్..సినిమా హాల్స్..వైను షాపులు..బార్లు..తెరచిన తర్వాత..పౌరులు యధేచ్ఛగా సంచరిస్తారు.

నెపం జనం మీదకు నెట్టేసి..బుద్ది హీనులైన పాలకులు..బాధ్యత నుండి తప్పించుకోజాలరు.

వీరు ఈ దేశానికి చేసిన కీడు..చరిత్ర మరువదు.

భారతదేశం ఆత్మ మధ్యతరగతి జీవనం..!

వారి బతుకులు చిందరవందర అయ్యాయి.

వ్యాధి సోకితే..ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తే ఇంతే సంగతులు.

శ్మశానాల్లో కూడా…నో వేకెన్సీ ..!

ఇదీ నేటి ముఖ చిత్రం…..

                                                                                      –  ర వి