ఏపీలో ఆవరించిన కరోనా వైరస్ కన్నా…కక్షల రాజకీయం ప్రమాదం?

714

మూర్ఖులు రాజ్యం ఎలితే రాజ్యాంగానికి,ప్రజాస్వామ్యానికి,న్యాయానికి,ధర్మానికి,నీతికి విలువ ఎక్కడ వుంటుంది. గతంలో రాక్షసులు అంటే పేరు విన్నారు కానీ  ప్రజలు చూడలేదు.కానీ నేడు రాక్షసులు ఎలా వుంటాడో జగన్ రూపంలో నిజంగా చూస్తున్నారు ప్రజలు. రాక్షసులకు రాక్షసత్వం నేర్పింది కూడా జగనే  అన్న విధంగా పరిపాలన సాగిస్తున్నారు.అరాచక,అసమర్ధ పరిపాలనపై ఎదిరించి పోరాడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు పై  అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది వైసీపీ ప్రభుత్వం.చిన్న విమర్శని సైతం సహించలేని ఆందోళనకర వాతావరణం నెలకొన్నది రాష్ట్రంలో.

అసలు రాష్ట్రాన్ని నరులు పాలిస్తున్నారా?నరరూప రాక్షసులు పాలిస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది.  జనశ్రేయానికి గొడుగు  పట్టాల్సిన అధికారాన్ని ప్రతిపక్షాన్ని వేధించడానికి,దెబ్బ తీయడానికి  ఉపయోగిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలో హిట్లర్ ను ఆదర్శంగా తీసుకొని ఫాసిస్థు పాలనకు తెరతీశారు. ప్రభుత్వాన్ని నడిపే విషయం లో ఒక పద్దతి కానీ,విధానం కానీ తెలియక రాజకీయ రభస సృష్టించి పాలానా వైపల్యాలు కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నియంత పాలనలో కనపడని దౌర్జన్య కాండ కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు రాళ్ళేత్తే  కూలీలుగా మార్చారు.
 రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో వున్నామా?రాచరికపు పాలనలో వున్నామా ?అని అర్ధం కావడం లేదు. అధికారం  ఎవరికి శాశ్వతం కాదు. మాకు తిరుగులేదు,ఎదురులేదు అని ఎగిరేగి పడిన వారు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయిన వాస్తవాలు గుర్తించాలి.అన్యాయంగా,అకారణంగా అవినీతిని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు.
అవినీతి బురదలో పొర్లిన వారికి శుభ్రంగా వున్నవారు నచ్చడట  అందుకే తమ తప్పులు ఎత్తి చూపిన వారి పై,ఎదురు దాడి చెయ్యడం,వారికి అవినీతి బురద పూయడం తండ్రి వైఎస్ నుంచి జగన్ వారసత్వంగా పుణికి పుచ్చు కొన్నారు.ప్రజలు  ఇచ్చిన అపూర్వ అధికారాన్ని వారి మేలు కొరకు ఉపయోగించి ప్రజల మెప్పు పొందాల్సింది పోయి ప్రతి పక్షాన్ని అణచి వేసి రాజకీయంగా బలపడాలి అనుకోవడం అనైతికం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పార్టీ అధినేత చంద్రబాబు నుండి మాజీ మంత్రులు అచ్చేన్నాయుడు,కోల్లు రవీంద్ర ల పై అక్రమ కేసులు బనాయించి వేధించారు. కళా వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్,బీటెక్ రవి, ఇప్పుడు పోటో మార్పింగ్ పేరు తో  మాజీ మంత్రి దేవినేని ఉమా పై అక్రమ కేసు బనాయించారు, ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర కు కనీసం నోటీసులు ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు.
సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థకు కట్టబెట్టేందుకు దూళిపాళ నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి అక్రమ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుంది.రెండేళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమిటో చెప్పుకోలేరు.వారికి  వేధింపులు,కక్ష సాధింపులు, అక్రమ కేసులు తప్ప ప్రభుత్వానికి మరొకటి చేతకాదని రుజువు చేశారు.
రాష్ట్రంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది.రోజుకు పది వేల కేసులు దాటిపోతున్నాయి.కరోనా శవాలు రావణ కాష్టం లా కాలుతున్నాయి.ప్రభుత్వ ఎజెండా  కరోనా నియంత్రణ కాదు.ప్రతిక్షాన్ని నియంత్రించడమే ప్రభుత్వ ఎజెండా గా కనిపిస్తుంది.ప్రతిపక్షాన్ని అణచి వెయ్యడానికి చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాలను బలితీసుకొంటున్న కరోనా కట్టడి పై చూపడం లేదు.సంకుచిత రాజకీయమే తప్ప ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ ప్రళయ కాలంలో కూడా రాజకీయ స్వార్ధాలకు,ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎంత వరకు అవసరమో ప్రజలే అర్ధం చేసుకోవాలి.

కష్ట కాలంలో ప్రజలను రక్షించడానికి బదులు  తన సొంత ఎజెండాను ప్రజలపై రుద్దుతు ప్రజల ప్రాణాలను గాలిలో దీపం చేసింది ప్రభుత్వం. ఈ క్లిష్ట సమయంలో కరోనా కట్టడి పై బహుముఖ చర్యలు చేపట్టి ప్రజల కాపాడాల్సిన ప్రభుత్వం .తన లక్ష్యానికి అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షం బలంగా వుండాలి.అధికారంలో వున్నవారు ప్రజావ్యతిరేక  నిర్ణయాలు తీసుకొంటే వాటిని నిలువరించి ప్రభుత్వాన్ని   సరైన మార్గంలో పెట్టడానికి ప్రతిపక్షం బలంగా వుండాలి.కానీ నేటి పాలకులు ప్రతిపక్షం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు . ప్రశ్నించే గొంతులను ఏదో విధంగా గొంతు నొక్కడమే ఎజెండాగా పెట్టుకొన్నది జగన్ ప్రభుత్వం. అక్రమ కేసులతో ప్రతిపక్షాన్ని మీ గడిలో కట్టాలనుకోవడం  దుస్సాహసమే.తమ  అవినీతిని,వైపల్యాలను చూపించే చానల్స్ వుండకూడదు.తమను ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో ఏం అసలు ఏం  జరుగుతుందో  ప్రజలకు నిర్భయంగా చెప్పగలిగే స్వతంత్ర మీడియా కానీ,మేధావులు కాని లేరు.వ్యతిరేఖంగా రాసే మీడియా ఉనికి లేకుండా చెయ్యడానికి ప్రభుత్వం అన్నివిదాలా ప్రయత్నం చేస్తుంది.

జగన్ చేతకాని పరిపాలన వలన రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాక పోగా కొత్త సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి.ఈ  వాస్తవాన్ని నవ్యాంద్రా సమాజం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.జగన్ ఒక్క ఛాన్స్ ఇవండి అని వేడుకొని అధికారంలోకి వచ్చాక మరో అయిదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం వ్యూహరచన చేస్తూ ప్రతి పక్షాన్ని అణచి వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఆయుదేళ్లు దేవుడెరుగు ఇప్పుడు జరుగుతున్న నష్టం సంగతి ఏమిటి? దీనిని గుడ్డిగా సమర్ధించడ మా?లేక హేతు బద్దంగా ఆలోచించి ప్రశ్నించడమా?అన్నది నవ్యాంద్రా సమాజం తేల్చుకోవాలి.పాలించినంతకాలం  కక్ష సాధించడానికి,వేధించడానికి  సమయం సరిపెడితే  ప్రజలను పాలించేది ఎప్పుడు ? ఇంత  హీనమైన, నిలువెల్లా విషం నిండిన ముఖ్యమంత్రిని  దేశ ప్రజలు కూడా చూసి వుండరు. ప్రజల పక్షాన ప్రతి పక్షం మాట్లాడటం ఘోరమా? జనహితం కాంక్షించేవారి పై వివేకం,విచక్షణ  లేకుండా కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యమా? ఈ తరహా దమన కాండ ఎక్కడన్నా వున్నదా ?ఆర్ధిక నేరగాళ్ళు శాసన నిర్మాతలై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే దుష్ట సంస్కృతికి శ్రీకారం  చుట్టారు. ప్యాక్షనిజం తలకెక్కించుకొన్న వ్యక్తి పాలనలో ప్రజాస్వామ్య,రాజ్యాంగ,మానవీయ విలువలకు ప్రాధాన్యత వుంటుంది అనుకోవడం అత్యాసే అవుతుంది. రాగ ద్వేషాలు జయించలేని కారణంగానే హిరణ్యాక్షుడు,హిరణ్య కశివుడు,రావణుడు,దుర్యోధనుడు,చరిత్ర హీనులుగా మిగిలి పోయిన వాస్తవాన్ని గుర్తించాలి.
చట్టం,న్యాయం,ధర్మం , నైతికత,ప్రజాసామ్యం ,రాజ్యాంగం,విలువల తో నాకు సంభందం లేదు.నేను చేసిందే చట్టం,నేను చెప్పిందే రాజ్యాంగం అన్న విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.మానిర్ణయాలుకాదంటే సహించం,రాజ్యాంగం అయినా,ప్రజాస్వామ్యం అయినా,న్యాయవ్యవస్థ  అయినా,మీడియా అయినా,ప్రతిపక్షాలు అయినా,ప్రజలయినా మా వెనక నడవాల్సిందే. అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.
  డ్రాగో  రాజ్యాoగంలోని అరాచకత్వం,రాజారెడ్డి రాక్షసత్వ పర్వాలు  కలగలిపి నవ్యాoధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చాయి.ఫాసిజం రాజ్యామెలుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకుల పై అక్రమ కేసులు, కక్షసాధింపులతో జర్మనీలోనాజీలదురాగతాలను కళ్ళకుకడుతున్నది. జగన్ పాలన అరాచక,అనాగరిక పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పై ఆవరించి వున్న కరోనా వైరస్ కన్నా, అధికార పార్టీ రాక్షస రాజకీయం ప్రమాద ఘటికలు మొగిస్తుంది.చట్ట బద్ద పాలనకు సమాది కట్టి పోలీస్ రాజ్యం స్థాపించారు.
గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా నిరంకుశంగా ,అప్రజాస్వామిక రీతిలో పరిపాలించలేదు. ఆర్ధిక నేరస్థుడు గా అంతర్జాతీయంగా రాష్ట్రం పరువుతీసిన నాయకుడు నేడు అందరిని అవినీతి పరులుగా చిత్రించాలని చూడటం సిగ్గు చేటు. ఏది  ఏమైనా అసూయతో రగిలి పోయే వారు ఏమి చేయలేరు.ఇప్పటి కైనా  ప్రతీకార రాజకీయాలు మాని కరోనా కట్టడి పై బహుముఖ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి,లేకుంటే జగన్ రెడ్డి శవాల దిబ్బపై రాజ్యం ఎలాల్సి వస్తుందన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి.
-నీరుకొండ ప్రసాద్