బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా డా.పార్థసారథి

315

ఈరోజు ఢిల్లీలో కేంద్ర బిజెపి పార్టీ , ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రధాన్యత ఇస్తూ ప్రకటన విడుదల చేసారు.

డా.పార్థసారథి ,ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నారు. గత 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు . అంతేకాకుండా మొన్న జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.  ఇప్పుడు ఏ పి – బి జె పి మీడియా  ప్యానెల్ లిస్ట్ గా కూడా ఉన్నారు. వృత్తిపరంగా దంతవైద్యుడు అయిన పార్థసారథి ‘పార్థ డెంటల్ ‘ పేరుతో దేశ వ్యాప్తంగా డెంటల్ క్లినిక్ లు నడుపుతున్నారు .

ఈ సందర్భముగా డా.పార్థసారథి గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది అనటానికి ఈ పదవే ఉదాహరణ. నాపై నమ్మకము తో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు గాను జాతీయ అధ్యక్షులు నడ్డా కి,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్కి , మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కి , రాష్ట్ర ఇన్చార్జిలు మురళీధరన్ , సునీల్ దేవధర్ లకు ధన్యవాదాలు తెలుపుతూ , మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి నన్ను ఎంచుకున్నందుకు గాను శక్తి వంచన లేకుండా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.