ఫ్యామిలీ మొత్తం ఆస్కార్ నటులే!

935

ఏవరేమనుకున్నా ఫర్వాలేదు. షర్మిల ప్యామిలీపై ఇది నా నిశ్చితాభిప్రాయం. ప్రధానంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయమిది! తెలంగాణలో పార్టీ పెడతానంటున్న షర్మిల అసలు లక్ష్యం ఏమిటన్నది తెలంగాణ ప్రజలు గమనించకపోతే, తెలంగాణ సమాజం మరోసారి నష్టపోవలసి ఉంటుంది. నా బాధ, ఆవేదన, ఆక్రోశం అదే!!

ఇవన్నీ క్రైస్తవ గురువులు, షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆడుతున్న నాటకాలు మాత్రమే. ఇటు హిందూ రెడ్డి కార్డు, అటు బైబిల్ పట్టుకుని తెలంగాణ విచ్చిన్నం కోసం ఆడుతున్న నాటకాలు. తెలంగాణ రెడ్లు వీళ్ల మాయలో పడిపోకూడదు. మనకు ఒక చరిత్ర ఉంది. రజాకార్లు, బ్రిటిషర్లపై కులమతాలకు అతీతంగా పోరాడి, స్వాతంత్య్రం సాధించిన మహోన్నత చరిత్ర మనది. దానికోసం భూములు, గడీలు, యావత్ ఆస్తులు ధారపోసిన చరిత్ర మనది. నిజాం, వారి వారసులయిన రజాకార్లపై ప్రాణాలొడ్డి పోరాడి, తెలంగాణ ప్రజలను రక్షించేందుకు ప్రాణాలర్పించిన రెడ్డినేతలు ఎందరో. వారి త్యాగమే ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలాంటిది.. ఇలాంటి కల్తీ నేతలు, మన తెలంగాణకు అవసరమా? నాణ్యమైన, నిఖార్సయిన హిందువే ఇప్పుడు తెలంగాణకు అవసరం. అందుకే షర్మిల పార్టీ గురించి రెడ్డి సమాజం మరోసారి ఆలోచించక తప్పదు.

ఆమె పార్టీ లక్ష్యం హిందువులలో చీలికల కోసమేనన్నది నిర్వివాదాంశం. తెలంగాణలో క్రైస్తవ మతవ్యాప్తి కోసమే ఈ పాచికలు. అందుకు  క్రైస్తవ మిషనరీలు ఆమెకు డబ్బు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి డబ్బులు కుమ్మరించేందుకు క్రైస్తవ సంస్థలు సిద్ధమవుతున్నాయి. వాటితోనే తెలంగాణపై భారీ కుట్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. హిందువులలో చీలికలు సృష్టించడం ద్వారా, రాజకీయ-మతపరమైన లబ్థి కోసమే ఈ ప్రయత్నాలన్నీ!  అందుకే తెలంగాణ సమాజం, ముఖ్యంగా రాజకీయంగా చైతన్యశీలురయిన రెడ్డి సామాజికవర్గం..  షర్మిల పార్టీపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.  అసలు పౌరసత్వబిల్లును వ్యతిరేకించిన మీరు ఏమొహంతో తెలంగాణకు వచ్చారు? అని కదా తెలంగాణ సమాజం నిలదీయాల్సింది? ఇప్పుడు ఆంధ్రాలో కిరస్తానీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా అదే ప్రయోజనాల  కోసమే.. కొత్త నినాదం, కొత్త ముసుగులో, కొత్త కుట్రలకు తెరలేపడం తెలంగాణ ఉనికి, ఉద్యమ లక్ష్యానికి పెను ప్రమాదం కనిపిస్తోంది.

మనం ఇక్కడ కొన్ని కఠోర వాస్తవాలు మాట్లాడుకోవాలి. దానిని  తెలంగాణ సమాజం కూడా పరిశీలించాలి. ఆంధ్రజ్యోతి, టీవీ 9 షర్మిలకు అమ్ముడుపోయాయి. సాక్షి కవరేజ్ ఇవ్వకపోవడం, షర్మిల సాక్షి కవరేజ్ ఇవ్వదుగా వెటకారంగా అనడం, పక్కనేఉన్న విజయలక్ష్మి కంగారుపడి, అన్న-వదిన ఏమైనా అనుకుంటారని షర్మిలను గిల్లడం.. ఇవన్నీ మహానటులకు తీసిపోని నటనలే. అసలు జగన్-షర్మిల మధ్య అగాథం ఏర్పడిందని ఏబీఎన్ రాధాకృష్ణ గొంతు చించుకోవడమే పెద్ద కుట్ర! ఈ మొత్తం కథకు సూత్రధారి కేసీఆర్!! కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండికొట్టడం..కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉన్న రెడ్లను, బీజేపీ వైపు వెళ్లకుండా చూడటం..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం.. అదీ షర్మిల కొత్త పార్టీ వెనుక చిదంబర రహస్యం!!!

ఈ  మొత్తం కథలో కేసీఆర్‌కు లాభం చేకూర్చడమే అన్నా చెల్లెళ్ల అసలు లక్ష్యం. తన చెల్లి తన మాట వినడం లేదని బీజేపీకి చెప్పడమే ఇక జగన్ వినిపించనున్న మరో కథ. దానికి మాధ్యమ నారదుడు కావాలి. అందుకు కేసీఆర్‌కు దొరికిన నారదుడు రాధాకృష్ణ!  ఇంకేముంది.. రాధాకృష్ణతో బ్రదర్ అనిల్ భేటీ!? కట్ చేస్తే రాధాకృష్ణతో షర్మిల పార్టీ కవరేజ్ బాధ్యతలు, కథనాలు రక్తికట్టించడం. కేసీఆర్ సొంత చానెలయిన టీవీ 9లో కాకుండా, రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో రాయించడమే అసలు గుట్టు దాగుంది! ఎందుకంటే సొంత చానెల్‌లో షర్మిలకు కవరేజ్ ఇస్తే, అసలు గుట్టు రట్టవుతుంది కదా? అదీ అసలు కథ! ఇదే  ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో షర్మిలకు వస్తున్న ఫుల్ కవరేజీ రహస్యం!!!

ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం సింపుల్. జగన్‌ను అమిత్‌షా ఢిల్లీకి పిలిపిస్తే, ఆయన ప్రత్యేక విమానంలో అక్కడకు వెళతారు. మీరు కోపం తెచ్చుకోవద్దు. ఇది కేసీఆర్ వ్యూహం కావచ్చు. అయినా ఇదంతా మీకే లాభమని.. ఆ లాభమేమిటో షా గారి చెవిలో చెబుతారు. ‘సార్.. తెలంగాణలో మా మతం ఓట్లు, తర్వాత మా రెడ్ల ఓట్లు చీల్చడం మాత్రమే కాదు. కేసీఆర్‌కు ముస్లిం ఓట్లు కీలకం. ఆ ఓట్లు కూడా మేం చీల్చగలుగుతాం. ఆ శక్తి మాకుంది’ అని గొప్పగా విశ్లేషిస్తారు. అప్పుడు షా గారికీ కాంగ్రెస్ ఓట్లు చీలతాయంటే సంతోషమే కాబట్టి, శహభాషని జగన్ భుజం తడతారు.

ఆ ప్రకారంగా.. తెలంగాణ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న రెడ్ల ఓట్లు, షర్మిల పార్టీ ద్వారా చీల్చి.. అంతిమంగా క్రైస్తవులు-ముస్లింల మద్దతుతో, మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తారు. అదన్నమాట అసలు స్కెచ్! తెలంగాణ రెడ్లు, హిందువులు ఈ కులాల కుట్రరొంపిలో పడకుండా.. నిఖార్సయిన హిందువును పాలకుడిగా చేసేందుకు కృషి చేయాలి. అప్పుడే రజాకార్లపై రెడ్లు చేసిన పోరాటానికి నిజమైన నివాళి!

                                                                                   – పెంజెర్ల మహేందర్‌రెడ్డి
                                                                                      సీనియర్ జర్నలిస్టు
                                                             ( రచయిత జాతీయ ఓసీ సంఘం  అధ్యక్షుడు)