విశాఖకు రాజధాని వస్తుంది:ఎంపీ విజయసాయిరెడ్డి

333

విశాఖ: త్వరలోనే ఏపీకి విశాఖ రాజధానిగా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మట్లాడారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో 740 స్లమ్ ఏరియాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజధాని నగరంగా మారునున్నందున స్లమ్ లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని ఆయన పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, భీమిలి 6 లైన్ల రోడ్లకు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరుద్యోగుల కోసం త్వరలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఏదైనా చేయించుకోగలడని ఆయన ధ్వజమెత్తారు. చిన్న గులకరాయిని తన సభ మీద వేయించుకొని పెధ్ద రాద్ధాంతం చేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీకి జనసేన, టీడీపీ, బీజేపీలు అసలే పోటీనే కాదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 17 తర్వాత తమ పార్టీ ఉండదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారని విజయసాయి తెలిపారు.