షర్మిల దీక్ష ప్రారంభం

527

దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద బుధవారం తన దీక్షను ప్రారంభించారు. రాష్ట్రంలోఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే డిమాండ్ తో దీక్షను ప్రారంభించారు. 72 గంటల పాటు దీక్షను నిర్వహించాలని భావించగా తెలంగాణ ప్రభుత్వం ఒక రోజుకు మాత్రమే అనుమతి మంజూరు చేసింది. . ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్షను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.