ధరలు లేక నష్టాలతో విలవిలలాడుతున్న టమాటా రైతులు

588
 మోపిదేవి మండలం లోని నాగయ తిప్పచిరువోలు లంక. గ్రామాల్లో మూడు వందల ఎకరాల లో రైతులు టమాటా పంట ను సాగు చేస్తున్నారు . ఎకరాకు రూ 30వేలు కవులు చెల్లించి. 40,000 వరకు పెట్టుబడి పెట్టి టమోటా పంటలు సాగు చేశారు. గత నెల రోజులుగా రైతుల వద్దనుండి దళారులు 30 కేజీల ట్రైను రూ 100 నుండి 120 చొప్పున గ్రేడింగ్ చేసి అరువు కొనుగోలు చేస్తున్నారు. కానీ డబ్బులు అడిగిన రైతుల వద్ద కొనుగోలు నిలిపివేస్తున్నారు. దళారులు కుమ్మక్కై పంట చివర్లో కొంత మొత్తాన్ని నిలిపి వేసే ప్రయత్నంలో ఉన్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నాగాయలంక మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆనంద్ అధికారులతో కలిసి టమాటా పంట ను పరిశీలించి ఉన్నతాధికారులకు విషయం నివేదించారు. అయినప్పటికీ రైతుల పరిస్థితి ఏ మాత్రం మార్పు రాలేదు. నేటికి30 కేజీల బాక్స్ రూ 100 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.