విశ్వ మానవులు.. !

354

మార్క్స్ !
లెనిన్ !
స్టాలిన్ !
కాస్ట్రో, చేగువేరాలు విదేశీయులా !
అది విదేశీ సిద్ధాంతమా ?

కారల్ లాండ్ స్టైనర్ !
క్రిస్టియన్ బెర్నాడ్ !
ఐజాక్ న్యూటన్ !
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ?
లూయిస్ పాశ్ఛర్ ?
జెన్నర్ ?
విలియం హార్వే!
నార్మన్ బెతూన్ ! లు విదేశీయులే!

విద్యుత్తూ!
విద్యుత్ మోటార్ !
ఏసీ !
ఫ్యాన్ !
పెన్సిలిన్
మశూచి టీకాలూ!
పోలియోచుక్కలూ!
రక్తమార్పిడీ!
సిటీ స్కానూ!
ఆధునిక వైద్య పరికరాలన్నీ!
విద్యుత్ బల్బు!
రేబిస్ టీకా!
పాశ్చరైజేషన్ !
కారు!
రైలు!
బుల్లెట్ రైళ్ళూ!
విమానం!
టీవి!
సెల్ ఫోనూ!
సిమెంటూ!
కాంక్రీటూ!
తుపాకీ!
మనవి గావుగా!?
ఎందుకు
వాడుతున్నారు!

మార్క్స్ !ఏంగెల్స్ !లు
పేదవాళ్ళ !కష్టజీవుల
కష్టాలు తీర్చే సిధ్ధాంతం
కనిపెట్టేరు!

1857లో ఈస్టిండియా కంపెనీ,
తర్వాత బ్రిటిష్ వాళ్ళు,
భారతప్రజలపై చేసిన కిరాతకాల
ను ప్రపంచం ముందుంచారు!
భారత ప్రజల పక్షాన నిలిచారు!

ఆ పుస్తకం మనపిల్లలకు
ఇవ్వరెందుకు?భయమెందుకు?
కిరాతకాలుచేసిన బ్రిటీషోళ్ళంటే మోజెందుకు?

పెద్ద జబ్బులొస్తే అమెరికా, ఇంగ్లండెందుకు?

ఆయుర్వేదం చేయించుకోరేం?
అమెరికాలో ఉద్యోగాలూ వ్యాపారం,  ఎందుకు?
సంపాదించింది ?
భారత్ లోగాక,  స్విస్! లగ్జెంబర్గ్
లలోనా?
భారత బక్కరైతులు
మూడులక్షలమంది మరణిస్తే
బాధుండదేంటి?
ఒక్క కన్నీటిబొట్టూ,,

మనడబ్బు అక్కడదాచి!
విదేశీ పేట్టుబడులకు
ఆహ్వానమేంది?

వాళ్ళకు పన్ను రాయితీలేంది?
హెఛ్ 1B వీసాలకోసం ఆరాటమేల?

ఈదేశ ప్రజల సొమ్ము దోచి
విదేశాలలో !? న్యాయమేనా?
మనందరం భారతీయులమేగా.

వివక్షత! తేడాలెందుకు!
కౌలు రైతుకు పైసా రుణందొరకదు!
బడా బాబులకు వేల కోట్లఅప్పులూ
మాఫిలూ! న్యాయమేనా!

వేలకోట్లు పన్ను
ఎగేసినోళ్ళపేర్లు రహస్యమా?
కోపగించుకోకుండా!
సమాధానమివ్వమని
వినమ్ర విజ్ఞప్తి!

 – మొలకలపల్లి వెంకటకృష్ణయ్య