ఓటేసిన సూర్య,కార్తీ

453

ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ఈ రోజు ఉదయాన్నే టి.నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలకూ ఇవాళ ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే… సూర్య, కార్తీకి కమల్ హాసన్ అంటే అభిమానం. గతంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో కమల్, రజనీకాంత్… విశాల్, సూర్య, కార్తీ టీమ్ ను బలపరిచారు. మరి ఇప్పుడు డీఎంకె, అన్నా డి.ఎం.కె మధ్య బలమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కమల్ హాసన్ సైతం తన సొంత పార్టీ అభ్యర్థులను బరిలో దించాడు. మరి సినీ జనం ఏ పార్టీ వైపు నిలబడతారో చూడాలి.