8 రాష్టాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

398

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): భారత్‌లోని ఎనిమిది రాష్టాలలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 72,330 కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో 84.61% ఈ ఎనిమిది రాష్టాలనుంచే రావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 39,544 కొత్త కేసులు రాగా చత్తీస్‌గఢ్‌లో 4,563. కర్నాటకలో 4,225 కేసులు వచ్చాయి. దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 5,84,055కి చేరుకుంది.

ఇది దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 4.78%. గత 24 గంటలలో కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా 31,489 కేసుల పెరుగుదల నమోదు చేసుకుంది. ఐదు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, చత్తీస్‌గఢ్, పంజాబ్‌ కలిసి మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 78.9% వాటా ఉండటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 61% మంది చికిత్స పొందుతున్నవారున్నారు. మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షలల్లో ఆర్‌టి పిసిఆర్ పరీక్షలు తక్కువ నమోదు చేసుకుంటున్న రాష్టాలను ఈ క్రింది చిత్రపటం చూపుతోంది. మొత్తం పరీక్షలలో ఆర్‌టి పిసిఆర్ పరీక్షలు కనీసం 70% ఉండేట్టు చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోంది. 45 ఏళ్ళు పైబడ్డవాళ్లందరికీ కోవిడ్ టీకాలిచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది.

ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 10,86,241 శిబిరాల ద్వారా ఆరున్నర కోట్ల (6,51,17,896) టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఇందులో 82,60,293 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,50,704 రెండో డోసులు, 91,74,171 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 39,45,796 డోసులు వారికిచ్చిన రెండో డోసులు, 78,36,667 డోసులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 17,849 వాళ్ళకిచ్చిన రెండో డోసులు, 3,05,12,070 డోసులు 60 ఏళ్ళ పైబడ్డ వారి మొదటి డోసులు, 1,20,346 డోసులు వారి రెండో డోసులు ఉన్నాయి. టీకాల కార్యక్రమం మొదలైన 75వ రోజైన మార్చి 31న 20,63,543 టీకా డోసులిచ్చారు. అందులో 17,94,166 మంది 39,484 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 2,69,377 మంది రెండో డోస్ తీసుకున్నారు.

భారతదేశంలో ఇప్పటిదాకా మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,14,74,683 కు చేరుకున్నారు. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.89%. గత 24 గంటలలో 40,382 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో 459 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఆరు రాష్ట్రాలలో 83.01% మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 227 మంది చనిపోగా పంజాబ్‌లో 55 మంది చనిపోయారు. గత 24 గంటలలో పదిహేను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదు. చండీగఢ్, జార్ఖండ్, ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, పుదుచ్చేరి, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికొబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మరణాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కోవిడ్ టీకా కేంద్రాలన్నీ వాడకంలో పెట్టాలని కూడా ప్రకటించింది. ఇవి ఏప్రిల్ నెల మొత్తం 1వ తేదీ నుంచి 30 వరకు సెలవుదినాలతో సహా పనిచేస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. మార్చి 31న రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించిన మీదట కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని కోవిడ్ టీకా కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరింది.

టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎక్కువమందికి టీకాలు అందించాలని ఆ లేఖలో సూచించింది. కోవిడ్ మీద సాగిస్తున్న పోరులో భాగమే ఈ వేగవంతమైన టీకాల కార్యక్రమమని కూడా కేంద్రప్రభుత్వం తెలియజేసింది. దేశంలో కరోనా సోకటానికి అవకాశమున్న వర్గాలను కాపాడటమే ధ్యేయంగా టీకాల కార్యక్రమం చేపట్టినట్టు ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. అందువలన దీని అమలును ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షించాలని కోరింది. కోవిడ్ టీకాల నిర్వహణమీద ఏర్పాటైన జాతీయ నిపుణుల బృమ్దం ఇచ్చిన సలహా మేరకు 45 ఏళ్ళు దాటినవారందరికీ 1 నుంచి టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.