అయ్యప్ప సన్నిధిలో కొత్త బోర్

543

కడప, మార్చి 29 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చొరవతో మాజీ జెడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లె టౌన్ పరిధిలోని నామాలగుట్ట వద్ద నూతనంగా నిర్మాణం చేపడుతున్న అయ్యప్పస్వామి ఆలయం వద్ద గ్రామ పంచాయితీ నిధుల ద్వారా భక్తుల సౌకర్యార్థం నూతన బోర్‌తో పాటు మోటార్‌ను ఏర్పాటు చేయడంతో సోమవారం స్థానిక కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారి దర్శననంతరం ఆలయ నిర్మాణం పనులను పరిశీలించారు. కమిటీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డిని దుస్సాలువాతో సత్కరించారు. ఆలయ నిర్మాణం పనులు పూర్తి కావడానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తామని మాజీ జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ రవిరాజు, మైనార్టీ నాయకులు సయ్యద్ అమీర్, ఛాన్ బాష, వైఎస్సార్ సీపీ నాయకులు రాజా రెడ్డి, గురుస్వాములు సుబ్బయ్య, రమణ, వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు చెల్లు గంగరాజు, సుధీర్, శివశంకర్ రెడ్డి, నాగేష్, గంగాధర్ రాజు, నాగేంద్ర, భాస్కహార్, ప్రసాద్ యాదవ్, నరసింహా రెడ్డి, లాల్లు యాదవ్, రవి, నరసింహారాజు, చైతన్య రెడ్డి, శివయ్య, గంగయ్య, పద్దు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.