కొవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ సంతోష్

581

హైదరాబాద్, మార్చి 29 (వార్తా ప్రపంచం): రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్ దంపతులు‌, మంత్రి సంగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కొవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్‌లో తన సతీమణి రోహిణితో కలిసి ఎంపీ సంతోష్‌ కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిమ్స్‌ దవాఖానలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా విషయంలో అప్రమత్తత ముఖ్యమని చెప్పారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన పనులకోసం బయటకు రాకపోవడం ఉత్తమమని చెప్పారు. ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.