మాయమైపోతున్నాడు మనిషన్న వాడు…

364

రాజమహేంద్రవరం, మార్చి 29 (న్యూస్‌టైమ్): ‘‘పంజాబ్‌లో బిజెపి ఎమ్మెల్యేకి జరిగిన పరాభవం ఏపీలో బిజెపి వారికి తప్పదా?’’ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేసారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగు చట్టాలపై రైతుల సంక్షేమం, భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మోడీ సర్కార్‌కు భజన చేసే పంజాబ్ అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ అభూత ప్రకటనలు తెలుసుకున్న రైతులు రాజకీయాలకు అతీతంగా ఆ ఎమ్మెల్యేకు గుడ్డలూడదీసి పరాభావం చేసి రైతుల ప్రతిష్టను, పంజాబ్ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకుని మోడీ సర్కార్‌కు, ఆ పార్టీ వారికి హెచ్చిరిక జారీచేసారని ఆయన గుర్తు చేసారు. మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలును, భవిష్యత్‌ను పచ్చిగా మోసం చేసి దగా చేస్తున్నా ఏపీ బిజెపి వారికి ఇంకా సిగ్గులేకుండా మోదీ సర్కార్‌కు వంత పడుతున్నారని, ఈ తరహా భజన ఏపీలో తప్ప ఏ ఇతర రాష్ట్రాల్లో భజన చేసినా పంజాబ్ తరహా శృంగభంగం తప్పేది కాదని, ఏ ముఖం పెట్టుకుని ఏపీలో బిజెపి జండా మోస్తున్నారో అర్ధం కావటం లేదని, ఆంధ్రప్రదేశ్‌పై ఆ నాటి కాంగ్రెస్ నుండి నేటి బిజెపి వరకు కాలకూట విషం చిమ్ముతూనే వున్నారని, ఆంధ్రులు ఐఖ్యతగా వుంటే ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పడుతుంటాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కన్నా ఏపీలో వున్న బిజెపి వారికి ఢిల్లీ భజనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తిరుపతిలో ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి సిగ్గువుందా?! అని ప్రశ్నించారు. తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాక్షిగా ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రకటించి మోసం చేసిన ప్రధాని మోదీకి, ఆ పార్టీకి తిరుపతి ఉప ఎన్నికలో పోటి చేసే అర్హత లేదని ఆయన బిజెపి పార్టీపై ఆక్రోశం వ్యక్త పరిచారు. అన్యాయమైన విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కి ఏపీ, తెలంగాణా ప్రజల మధ్య అగాదం ఏర్పరిచారని, ఏపీలో అపారమైన ఖనిజ వనరులను కార్పొరేట్ గద్దలకు మోదీ సర్కార్ దోచి పెడుతుందని, ఏపీలో సహజ సిద్దమైన ప్రకృతి సంపదను గుల్ల చేసి ఆంధ్రప్రదేశ్‌లో మానవ మనుగడ లేకుండా చేయటమే మోదీ, అంబానీ, ఆదానీల ప్రధాన కుట్ర అని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను, విశాఖలో డివిజన్‌తో కూడిన రైల్వే జోన్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో 100 కోట్ల సంస్కృతిక కళా క్షేత్రం, రామాయపట్నం మేజర్ పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖపట్నం టు చెన్నై పారిశ్రామిక కారిడార్ తక్షణమే ప్రకటించి ఏపీలో బిజెపి జండా పుచ్చుకు తిరగాలని, సిగ్గు ఎగ్గు లేకుండా తిరిగితే పంజాబ్‌లో బిజెపి ఎమ్మెల్యేకి జరిగిన ఘోర పరాభవం కన్నా ఎక్కువ గుణపాఠం తప్పదని ఆయన హెచ్చిరించారు.