వల్లభనేని అరెస్టుకు డిమాండ్

377

విజయవాడ, మార్చి 29 (న్యూస్‌టైమ్): ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం కంకిపాడు పట్టణంలో పి.వి రావు మాల మహానాడు కృష్ణా జిల్లా కార్యాలయంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు గోగులమూడి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉయ్యూరు మండలం గండిగుంట నివాసి దళిత నాయకుడు కొండ ప్రవీణ్‌పై ఈనెల 24వ తారీఖున కాటూరు రోడ్డులో బహిరంగ ప్రదేశంలో వల్లభనేని నాగభూషణం అనే వ్యక్తి అనుచరుడితో దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించడం చాలా బాధాకరమైన విషయమని ఈ ఘటనపై ఉయ్యూరు పోలీసు వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఐదు రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం చాలా దారుణం అని ఇప్పటికైనా అరెస్టు చేయాలని లేకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి వర్రె చిట్టి బాబు, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొవ్వ సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు గోగులమూడి రాజు సంఘీభావం తెలిపి కొండా ప్రవీణ్‌కి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కో మవరపు ప్రసాద్, పామర్రు నియోజకవర్గ అధ్యక్షులు దర్శి శ్రీనివాస్ గాంధీ, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సరిహద్దు ఆంతోని, పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షులు పైయర్థ రామకృష్ణ, గన్నవరం నియోజకవర్గ యువజన అధ్యక్షులు పోనుగుమాటి ఉదయ భాస్కర్, పెనమలూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గోగులమూడి సురేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోవాడ బెర్నార్డ్ షా తదితరులు పాల్గొన్నారు.