జర్నలిస్టు కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం

93

రాయచోటి, మార్చి 29 (న్యూస్‌టైమ్): కడప జిల్లా రాయచోటిలో ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన జర్నలిస్టు రమేష్ రాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాయచోటి వైసీపీ మైనారిటీ విభాగం యువ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. సోమవారం వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం దిగువరాచపల్లెలోని జర్నలిస్టు రమేష్ రాజు నివాసానికి వెళ్లి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను బేపారి మహమ్మద్ ఖాన్ పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయంగా రూ.10 వేలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో తమ కుటుంబాలను సైతం చూసుకోకుండా వార్తలు సేకరిస్తూ నిత్యం ప్రజాసేవకై పోరాడుతూ ఇలా ఆకస్మికంగా జర్నలిస్టు రమేష్ రాజు మృతి చెందడం బాధాకరమని, రమేష్ రాజు కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు వారి పిల్లల పై చదువుల కోసం తన వంతు సహాయ సహకారం అందిస్తానన్నారు. ఈయన వెంట కౌన్సిలర్ అన్న సలీం, వైసీపీ నాయకులు నవాజ్, చిన్నా, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) కడప జిల్లా సెక్రటరీ చెన్నూరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.