ముంబయి, మార్చి 28 (న్యూస్‌టైమ్): కరోనా వెలుగు చూశాక స్వదేశంలో తొలిసారి టీమ్ఇండియా అదరగొట్టింది. అసలు సిసలు క్రికెట్ మజా అందించింది. సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డులు సృష్టించి పొట్టి క్రికెట్లో ఉత్కంఠతో నిలబెట్టి వన్డేల్లో అటు హిట్టింగ్ ఇటు వికెట్ టేకింగ్‌తో మురిపించింది. పర్యాటక ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. అన్ని ఫార్మాట్లను క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తానికి నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమ్ఇండియా దుమ్మురేపింది. పుణెలో 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆంగ్లేయులపై 7 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. సామ్ కరన్(95*; 83 బంతుల్లో 9×4, 3×6) భయపెట్టినా భువీ (3), శార్దూల్ (4)తో కూడిన బౌలింగ్ దళం ఆ జట్టును 322/9కి పరిమితం చేసింది. డేవిడ్ మలన్ (50; 50 బంతుల్లో 6×4) అర్ధశతకం చేశాడు. తొలుత టాప్ ఆర్డర్ విఫలమైన భారత్‌ను రిషభ్ పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్య (64; 44 బంతుల్లో 5×4, 4×6) ఆదుకొన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (67; 56 బంతుల్లో 10×4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో 43 ఓవర్లకే 337 పరుగులను ఛేదించింది ఇంగ్లాండ్. మరి ఫ్లాట్ పిచ్‌పై తేమతో తడిచే బంతితో టీమ్ఇండియా 330 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలదా అన్న సందేహాలు కలిగాయి. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు బౌండరీలు బాదేసిన జేసన్ రాయ్ (14; 6 బంతుల్లో 3×4)ను ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ చేసిన భువీ నమ్మకం కల్పించాడు. మళ్లీ అతడే మూడో ఓవర్ ఆఖరి బంతికి జానీ బెయిర్ స్టో (1; 4 బంతుల్లో)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో బెన్‌స్టోక్స్ (35; 39 బంతుల్లో 4×4, 1×6) బౌలర్లపై దాడి చేద్దామనుకున్నాడు. ప్రమాదకరంగా ఆడిన అతడిని జట్టు స్కోరు 68 వద్ద నటరాజన్ పెవిలియన్ పంపించాడు. మలన్‌తో 40 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. మరికాసేపటికే ప్రమాదకర జోస్ బట్లర్ (15; 18 బంతుల్లో 2×4)ను శార్దూల్ ఎల్బీ చేశాడు. లియామ్ లివింగ్స్టన్ (36; 31 బంతుల్లో 4×4, 1×6), అర్ధశతకం చేసిన మలన్నూ అతడే ఔట్ చేయడం ఇంగ్లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఇక గెలుపు టీమ్ఇండియాదే అనుకుంటే.. దానిని మరింత ఆలస్యం చేశారు మొయిన్ అలీ (29; 25 బంతుల్లో 2×4, 2×6), సామ్ కరన్. 155/5తో ఇబ్బందుల్లో పడ్డ జట్టును ఆదుకొనేందుకు విఫల పోరాటం చేశారు. బౌండరీలు బాదేశారు. ఏడో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్‌ను విసిగించిన ఈ జోడీని అలీని ఔట్ చేయడం ద్వారా భువీ విడదీశాడు. కానీ కరన్ పట్టువిడవలేదు. ఆదిల్ రషీద్ (19; 22 బంతుల్లో 2×4)తో కలిసి షాట్లు బాదడం మొదలుపెట్టాడు. చక్కని బౌండరీలతో 45 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఎనిమిదో వికెట్‌కు 57 (53 బంతుల్లో) భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 257 వద్ద రషీద్‌ను శార్దూల్ పెవిలియన్ పంపినా కరన్ వదల్లేదు. సిక్సర్లు బాదేశాడు. తొమ్మిదో వికెట్‌కు 60 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. విజయ సమీకరణాన్ని 18 బంతుల్లో 23గా మార్చాడు. అయితే ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా నటరాజన్ 6 పరుగులే ఇవ్వడంతో టీమ్ఇండియా గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (37; 37 బంతుల్లో 6×4) శుభారంభం అందించారు. కట్టుదిట్టమైన బంతుల్ని ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 103 (91బంతుల్లో) పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. గబ్బర్ 44 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. భారీ స్కోరుకు పునాది వేశారని ఆనందించేలోపే.. 15వ ఓవర్లో రషీద్ వేసిన గూగ్లీకి హిట్‌మ్యాన్ బౌల్డ్ అయ్యాడు. అతడే వేసిన తర్వాతి ఓవర్లో గబ్బర్ సైతం బౌలర్‌కే క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటికి స్కోరు 117. మొయిన్ అలీ వేసిన 17.4వ బంతికి కోహ్లీ (7; 10 బంతుల్లో 1×4) సైతం వికెట్ ఇచ్చేశాడు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (7; 18 బంతుల్లో) లివింగ్స్టన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 25 ఓవర్లకే 158/4తో కష్టాల్లో పడ్డ భారత్‌ను హిట్టర్లు రిషభ్, హార్దిక్ ఆదుకొన్నారు. ఐదో వికెట్‌కు 99 (73) పరుగుల సమయోచిత భాగస్వామ్యం అందించారు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశారు. 44 బంతుల్లో పంత్, 36 బంతుల్లో హార్దిక్ అర్ధశతకాలు సాధించడంతో 35.3 ఓవర్లకు స్కోరు 250కి చేరుకుంది. వీరిద్దరూ మరో 10 ఓవర్లు నిలిస్తే స్కోరు 360 దాటేస్తుందనిపించింది. కానీ సామ్ కరన్ వేసిన 35.6వ బంతికి పంత్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 256. మరో 20 పరుగులకే హార్దిక్‌ను స్టోక్స్ బౌల్డ్ చేశాడు. శార్దూల్ (30; 21 బంతుల్లో 1×4, 3×6) సిక్సర్లతో 44 ఓవర్లకే స్కోరు 300 దాటినా కృనాల్ పాండ్య (25; 34 బంతుల్లో) నుంచి అతడికి సహకారం అందలేదు. ఆఖర్లో ఇంగ్లాండ్ పేసర్లు విజృంభించడంతో కోహ్లీసేన 8 పరుగుల వ్యవధిలోనే చివరి 4 వికెట్లు చేజార్చుకుంది. 48.2 ఓవర్లకు 329కి ఆలౌటైంది. మార్క్‌వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీశారు. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ మంచి భాగ స్వామ్యంతో ఆడారు. రోహిత్ శర్మ 37, శిఖర్ ధావన్ 67 పరుగులకు అవుట్ అయ్యారు. వీరిద్దరు అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 పరులకు కె.ఎల్.రాహుల్ 7 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో ఇండియా స్కోర్ మందగించింది. అనంతరం రిషబ్ పంత్ హార్దిక్ పాండ్య వికేట్ పడకుండ స్కోర్ బోర్డ్‌ను పెంచుతూ అర్థ సెంచరీ సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో రిషబ్ పంత్ 5 ఫోర్లు 4 సిక్సర్లతో 78 పరుగులు వద్ద, హార్దిక్ పాండ్యా 5 ఫోర్లు 4 సిక్సర్లతో 64 పరుగుల వద్ద ఆవుట్ అయ్యారు. కృనాల్ పాండ్యా 25, శార్దూల్ ఠాకూర్ 30 పరుగులు, భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు, నట రాజన్ నాటౌట్ 0, ప్రసిద్ధ కృష్ణ 0 పరుగులు చేయకుండానే అవుటయ్యారు. ఎక్స్రాలు 10 పరులతో టీమిండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్కుడు మూడు వికెట్లు ఆదిల్ రషీద్ రెండు వికెట్లు మెయిన్ అలీ, లివింగ్స్ సన్,, బెన్ స్టోక్స్, సామ్ కరన్, టాప్లి తలో వికెట్ తీశారు. అనంతరం 330 పరు గుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు జేసెన్ రాయ్ 14 పరులకు జానీ బెయిర్‌స్టో ఒక పరుగుకు భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెన్ స్టోక్స్ 35, డేవిడ్ మలన్ 50 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. జోస్ బట్లర్ 15, లివింగ్స్టన్ 36, మెయిన్ అలీ 29, ఆదిల్ రషీద్ 19, పరుగుల వద్ద అవుట్ కాగా సామ కరన్, నాటౌట్ 96 టాప్ లి1, దీంతో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది దీంతో భారత్ ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలుపొంది వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 భువనేశ్వర్ కుమార్ 3 నటరాజన్ ఒక వికెట్ తీశారు.