పార్సిల్‌ రవాణా ద్వారా రూ.104.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన జోన్‌

723

పార్సిల్‌ రవాణాలో గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని అధిగమించిన దక్షిణ మధ్య రైల్వే
కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని అధిగమించడానికి
చేపట్టిన నూతన విధానా తోడ్పాటుతో పురోగతి

దక్షిణ మధ్య రైల్వే పార్సిల్‌ రవాణాలో గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని అధిగమించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గొప్ప మైురాయిని సాధించింది.  23 మార్చి 2021 తేదీ నాటికి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.103.86 కోట్ల ఆదాయాన్ని అధిగమించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.104.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అధికంగా రైళ్ల రాకపోకను క్రమబద్ధీకరించడంతో నూతన విధానాు చేపట్టి నిత్యవసర సరుకు రవాణాను కచ్చితమైన ప్రణాళికతో చేపట్టడంవ్ల పార్సిల్‌ రవాణాలో గత సంవత్సరం ఆదాయాన్ని అధిగమించడం సాధ్యపడిరది.

ఈ సమయంలో సమయసారని ప్రకారం సరుకు రవాణా రైళ్లు, దూద్‌ దురంతో, కిసాన్‌ రైళ్లు మరియు బంగ్లాదేశ్‌తో సహా ఇతర ప్రాంతాకు సరుకు రవాణా వంటి నూతన విధానాను చేపట్టడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పార్సిల్‌ రవాణాలో 32% అధిక పరిమాణంలో సరుకు రవాణా జరిగింది. సరుకు రవాణాలో ఈ నూతన విధానాు వైవిధ్యంగా మారాయి. దీన్ని అధిక స్టేషన్లకు జతచేయడంతో (ప్రారంభం మరియు గమ్య స్థానాు రెండూ కలిపి) దక్షిణ మధ్య రైల్వేలోని పార్సిల్‌ చిత్ర పటం మరింత విస్తృతమైంది. పార్సిల్‌ పనితీరులో జోన్‌ అనేక ఘనతను సాధించింది.

వాటిలో కొన్ని దిగువ విధంగా ఉన్నాయి :
` సమయసారని సరుకు రవాణా రైళ్లను మొదట ప్రారంభించిన వాటిలో జోన్‌ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23.3.2021 తేదీ నాటికి 519 సరుకు రవాణా రైళ్లు 41,101 టన్ను సరుకును రవాణా చేయడం ద్వారా రూ.19.68 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఈ రైళ్లు వినియోగదారుకు సౌకర్యవంతంగా ఉండేలా రవాణాలో సమయపానను పాటిస్తూ, సురక్షితంగా, వేగంగా మరియు ఆర్థిక ప్రయోజనాను కలిగించాయి.

` ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట నుంచి న్యూఢల్లీిలోని హజరత్‌ నిజాముద్దీన్‌కు ప్రత్యేకంగా పా రవాణాకు దూద్‌ దురంతోను ప్రవేశపెట్టింది. వాటి ద్వారా 7.14 కోట్ల లీటర్ల పా రవాణా అయ్యింది. (ఇది 2011లో రేణిగుంట నుంచి ప్రారంభించిన నాటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అధికం). 302 దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల రవాణాతో రూ.33.9 కోట్ల ఆదాయం వచ్చింది.

` దక్షిణ మధ్య రైల్వే దక్షిణ భారత దేశంలో మొదటి కిసాన్‌ రౖుెను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుంచి ప్రారంభించింది. పిమ్మట తెంగాణలో మొదటి కిసాన్‌ రౖుెను వరంగల్‌ నుంచి ప్రారంభించింది. మొత్తంమీద జోన్‌లో 103 కిసాన్‌ రైళ్లు నడపడం ద్వారా 36,949 టన్ను వ్యవసాయ ఉత్పత్తు రవాణా చేయబడినాయి. వీటి ద్వారా రూ.17.11 కోట్ల ఆదాయం సమకూరింది.

` దక్షిణ మధ్య రైల్వే బంగ్లాదేశ్‌కు మొదటిసారిగా ప్రత్యేక సరుకు రవాణా రౖుెను నడిపింది. ఈ పార్సిల్‌ రౖుె ద్వారా గుంటూరులోని రెడ్డిపాలెం నుంచి బంగ్లాదేశలోని బెనపోల్‌కు ఎర్ర మిరపకాయను రవాణా చేసింది. మొత్తంమీద జోన్‌ బంగ్లాదేశ్‌కు 5,035 టన్ను సరుకును రవాణా చేసి, రూ.2.33 కోట్లు పొందింది.
` దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారిగా, నూతన అధిక సామర్థ్యం గ ఎల్‌హెచ్‌బీ పార్సిల్‌ వ్యాన్లను ప్రవేశపెట్టింది. వీటిని కాచిగూడ నుంచి గౌహతికి సమయసారని సరుకు రైళ్లగా నడిపింది. ఇవి పార్సిల్‌ రవాణాలో వృద్ధికి మరింత తోడ్పాటును అందించాయి.

`రైళ్ల ద్వారా సరుకు ఆటంకాు లేకుండా, సజావుగా రవాణా చేయడానికి లాక్‌డౌన్‌ సమయంలో కార్గో అగ్రిగేటర్స్‌ సౌకర్యార్థం పు స్టేషన్లు తెరవబడ్డాయి.
` నిత్యవసర సరుకు సరఫరా కోసం మరిన్ని ప్రాంతాను అనుసంధానం చేస్తూ హౌరా, నిజాముద్దీన్‌, గౌహతి, ుథియానా మొదగు దూర ప్రాంతాకు కూడా సరుకు రవాణా అయ్యాయి.
`వీటికి అదనంగా, రెగ్యుర్‌ రైళ్ల ద్వారా లీజ్డ్‌, నాన్‌ ` లీజ్డ్‌ పార్సిల్‌ రవాణా చేయబడిరది. వీటిద్వారా 97,662 టన్ను సరుకు రవాణా అయి, రూ.31.35 కోట్ల ఆదాయం సమకూరింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మ్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పార్సిల్‌ ఆదాయంలో  పెరుగుదను సాధించినందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ను అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమయసారని ప్రకారం సరుకు రవాణా రైళ్లను ప్రవేశపెట్టడంతో సరుకు రవాణాపై వినియోగదారులో ఆదరణ పొందిందని మరియు జోన్‌లో సరుకు రవాణా పటిష్టతకు ఇది తోడ్పడిరదని ఆయన అన్నారు.