పులివెందుల పిల్లి ఎక్క‌డ దాక్కుంది?:సుంక‌ర ప‌ద్మ‌శ్రీ

1182

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న బీజేపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతారా? లేక ఇంకా కేసుల కోసం ఢిల్లీకి సాగిలబడతారా? అని నిలదీశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా నేను తీసుకువ‌స్తాను…మీరు నాకు 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి…. నా స‌త్తా ఏంతో చూపిస్తా అన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎక్క‌డ ఉన్నారు. హోదా ఇవ్వ‌క‌పోతే కేంద్రం మెడ‌లు వంచేస్తా, మెడ విరిచేస్తా అంటూ ప్ర‌గ‌ల్బ‌లు ప‌లికిన పులివెందుల పిల్లి ఎక్క‌డ దాక్కుంది హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని నిన్న పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం ప్ర‌క‌టిస్తే జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలేస్ లో ఏం చేస్తున్నారు ? 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా న‌రేంద్ర మోదీ తిరుమ‌ల శ్రీనివాసుని పాదాల సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. తిరుమ‌ల వెంక‌న్న పాదాల చెంత ఇచ్చిన హ‌మీనే ప్ర‌ధాని మోదీ గాలికి వ‌దిలేశారు. కేంద్ర ప్ర‌భుత్వం మెద‌టి నుంచి కూడా ఏపీ విష‌యంలో స‌వ‌తిత‌ల్లి ప్రేమ చూపిస్తోంది.

వైసీపీ, బీజేపీ, టీడీపీ నాయ‌కులు ఏ మోహం పెట్టుకుని తిరుప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే పోలవరం , అమ‌రావ‌తి రాజ‌ధాని పూర్తి చేయ‌డంతో పాటు విభ‌జ‌న హ‌మీలను అమ‌లు చేస్తుంది. ఎవ‌రు మోసం చేస్తున్నారు… ఎవ‌రు ప్ర‌జ‌ల మంచి గురించి ఆలోచిస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా ఆలోచించాలి. రాష్ట్రానికి అండ‌గా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాలి. వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఏమాత్రం చిత్త‌శుద్ది ఉన్న హోదా కోసం కేంద్రంపై పోరాటం చేయాలి  అని అన్నారు.