సూరీడుపై హత్యాయత్నం…!

536

సొంత అల్లుడు డా. సురేంద్రనాథ్ రెడ్డి(కూతురి భర్త) ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం…  జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్ను సూరీడు ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించిన సురేంద్రనాథ్ ఆయనపై క్రికెట్ బాట్ తో దాడిచేసి హత్యాయత్నం చేసాడని కూతురు గంగా భవాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోను ఓ సారి సురేంద్రనాథ్ రెడ్డి సూరీడు పై దాడి చేసాడు…  భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహహింస కేసు నమోదై ఉంది…  ఆ కేసులను ఉపసంహరించుకోవడం లేదనే కక్ష్యతోనే మామ సూరీడును హత్య చేసేందుకు అల్లుడు ప్రయత్నించాడని సమాచారాం….  కుమార్తె ఫిర్యాదుతో సురేంద్ర నాథ్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేసారు పోలీసులు.