ఇసుక ఉచితంగా ఇవ్వాలి:సోమువీర్రాజు

403

ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, జేపీ పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర
ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అమలుచేస్తున్న నాలుగో ఇసుక పాలనీని వ్యతిరేకిస్తూ, దానిని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ముందు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెదేపా ప్రభుత్వ హయాంలో బియ్యానికంటే ఇసుక ధర ఎక్కువ పలికిందని, దీంతో ప్రజలు నష్టపోయారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక ఆన్‌లైన్‌లో దొరక్క బ్లాక్‌ లభిస్తుందని, బంగారం కంటే ధర పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మాణం జరక్క 30 లక్షల మంది భవననిర్మాణకార్మికులు, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నిర్మాణ కార్మికుల వేదన వింటూ బాధపడాల్సి వస్తోందన్నారు.

అవగాహన లేమి
ప్రభుత్వానికి ఇసుక విధానాలపై సరైన అవగాహన లేదన్నారు. తాను అద్బుతంగా ఇసుకను పంపిణీ చేస్తానని చెప్పి పోలీసులను ఏర్పాటుచేసుకుని కూడా కార్యక్రమం అమలులో విఫలమయ్యారని విమర్శిరచారు. తాము చూస్తుండగానే శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది నుంచి 300 లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని, ఈ దోపిడికి అంతులేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలకు
ప్రకృతి వనరులు ఆదాయవనరుగా మారాయని ఆరోపించారు. ఈ అవినీతి బాగోతాన్ని భాజపా
తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇసుక పంపిణీ పాలసీలను మార్చాలని డిమాండ్‌ చేశారు.

అర్హతలేని జేపీ పవర్‌ కంపెనికి, నష్టాల్లో ఉన్న కంపెనీకి ఏ రకంగా ఇసుక పంపిణి కాంట్రాక్టును అప్పగించారని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు ఇందులో బినామీగా ఉండటం వల్లే ఈ కాంట్రాక్టును ఆ కంపెనీకి అప్పగించారనేది అర్దమౌతుందని అన్నారు. ప్రభుత్వ అండతో ఇసుకను దోచుకునే రాంబందులను భాజపా కార్యకర్తలు అడ్డుకుని నిలువరిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జేపీ పవర్‌ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును తక్షణం రుద్దచేయాలని, ఇళ్లు నిర్మించుకునే మద్యతరగతి
ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, మాజీమంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎస్‌.దయాకరరెడ్డి, అధికారప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, మహిళా మోర్చా రాష్ట్ర అధక్షురాలు నిర్మలా కిషోర్‌,మీడియా ప్యానలిస్ట్‌లు కోలా ఆనంద్‌, గాలి పుష్పలత,తదితరులు పాల్గొన్నారు.