వడ్లు గురించి మీకేం తెలుసు?

857

న్యూఢిల్లీ, మార్చి 22 (న్యూస్‌టైమ్): వడ్లను సంస్కృతంలో ‘శాలి ధాన్యం’ అని పేరుతో పిలుస్తారు. సాధారణంగా హేమంత రుతువులో పైరగుట వలన హైమంతిక ధాన్యం అని కూడా పిలుస్తారు. సంస్కృత నిఘంటుకార్తలు వడ్లను రెండు తెగలుగా విడదీసి శాలి ధాన్యం అని వ్రీహీ ధాన్యం అని పిలుస్తారు. వ్రీహి ధాన్యం అనేది వర్షాకాలంలో పండుతుంది. శాలిధాన్యం అనేది హేమంత రుతువులో పండుతుందని సంస్కృత నిఘంటుకర్తల అభిప్రాయం. వ్రీహిధాన్యంలో కృష్ణ వ్రీహి ధాన్యం (నల్ల వడ్లు), పాటల వ్రీహి ధాన్యం, కుక్కు తాండకాలు, శాలాముఖాలు, జంతుముఖాలు అనే రకాలు ఉన్నాయి. వ్రీహి ధాన్యం పాకంలో తియ్యగా ఉండటం, చలవనివ్వడం, కొద్దిపాటి మలబద్దకం కలగచేయడం, వ్రీహి ధాన్యం అన్నింటిలో కృష్ణ వ్రీహి ధాన్యం మిక్కిలి శ్రేష్టమైనది. ఈ ధాన్యం అన్నం తియ్యగా, తెల్లగా ఉంటుంది.

కొంచం వగరు కలిగి పిత్తాన్ని హరిస్తుంది. వీర్యవృద్ధిని ఇస్తూ, క్రిమిరోగాలు, కఫవ్యాధులు, రక్తపిత్త వ్యాధులు, తాపదాహాలు మొదలగువాటిని పోగొట్టి బుద్ది సూక్ష్మత కలిగిస్తుందట. కొంచం వాతాన్ని కూడా కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్రీహిధాన్యంలో షష్ఠికాలు (ఆరు నెలలకు పండేవి), మహా వ్రీహి ధాన్యం (పెద్ద వడ్లు), యవక ధాన్యం, పాక వ్రీహి ధాన్యం, రక్తసార ముఖాలు (ఎర్ర మొల కోలుకులు) మొదలగు రకాలు కూడా ఉన్నాయి. శాలి ధాన్యంలో రక్తశాలి, మహాశాలి, సుగంధప్రసవ, బృందారక, ముష్టక, శావరశాలి మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి అన్నం రుచికరంగా, స్నిగ్దంగా (చమురు కలిగి), బలాన్ని కలిగించడమే కాకుండా వీర్య వృద్ధికి ఉపయోగపడుతుందట. లఘుత్వాన్ని ఇవ్వడమే కాకుండా చలవ చేస్తుందని చెబుతారు.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట. వరి విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత ఆ ప్రాంతంలోని వర్షపాతం, నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ, ఎడగారులలో సుమారుగా 22.11 లక్షల హెక్టార్లలో వరిసాగు కాలువలు, చెరువులు, బావుల కింద సాగు చేయబడుతూ సుమారుగా 68.64 లక్షల టన్నుల ఉత్పత్తిన్నిస్తూ సరాసరి దిగుబడి ఎకరాకు 12-40 కిలోలు వున్నది. మన ఆహార భద్రత వరి పంటపై ఆధారపడి ఉన్నది. కాబట్టి రాబోవు రోజుల్లో తక్కువ విస్తీర్ణం, తక్కువ నీరు, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ది గుబడి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుండి పంటకోత వర కు సరైన యాజమాన్య మెళకువలు పాటించిన యెడల సాగు ఖర్చు తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చును.

ఇటీవల కాలంలో వరిసాగు ఖర్చు బాగా పెరిగింది. కూలీలపై ఖర్చు పెరగడం, కూలీలు సకాలంలో లభ్యం కావడం కష్టంగా మారింది. తరచుగా వచ్చే వర్షాభావ పరిస్థితుల వలన సకాలంలో వరి నాట్లు వేయలేకపోతున్నారు. కొన్ని పరిస్థితు లలో సకాలంలో నీరందక ముదురు నారు నాటుట లేదా నారు దెబ్బతినడం. వల్ల నాట్లు సకాలంలో పడక దిగుబడులు తగ్గడం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో సాగు ఖర్చు తగ్గించుకొని, కూలీల సమస్యను అధిగమిస్తూ సాంప్రదాయకంగా నారు పెంచి నాటేదానికి ప్రత్యామ్నాయ పద్ధతిని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలలో ఆచరణలోకి తీసుకువచ్చింది. విత్తనం ఎకరానికి 15-20 కిలోలు ఆదా అవుతుంది. పంట 7-10 రోజుల ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.2500 నుండిరూ.3000 వరకు తగ్గుతుంది.

మొక్కల సాంద్రత సరిపడా వుండటం వలన దిగుబడి 10-15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చు. కూలీల కొరతను అధిగమించవచ్చు. కూలీలపై ఆధారపడడం తగ్గుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంటకాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పడే వరి సాగు చేసుకునే అవకాశముంది. ఈ పద్ధతి సార్వా కంటే దాళ్వాకు అనుకూలంగా ఉంటుంది. సమస్యాత్మక నేలలు (చౌడు, క్లారము, ఆమ్లము) తప్ప సాధారణంగా వరిని సాగుచేసే అన్ని నేలలు అనుకూలం. ముంపుకు భూములు సాగుకు అనుకూలం కాదు. రకాన్నిబట్టి ఎకరాకు 10-15 కిలోలు అవసరమవుతాయి. కాండం గట్టిగా వుండి వేరు వ్యవస్థ దృఢంగా వుండి పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం. ఆయా ప్రాంతానికి అనువైన, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చును. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గోనె సంచిలో వేసి కాని లేదా గోనె సంచి కప్పిగానీ 24 గంటల పాటు వుంచాలి. 24 గంటల తర్వాత చూస్తే విత్తనాల ముక్కు పగిలి తెల్లగా మోసు వస్తుంది. రబీ పంట కాలంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది.

కాబట్టి 36 గంటల మండె కట్టాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో గింజలకు ముక్కు పగిలి తెల్లపూస వస్తే సరిపోతుంది. మొలక పొడుగా రాకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడా తయారు చేయాలి. పొలంలో నీరు నిలువ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే బయటికి పోవటానికి ఏర్పాట్ల చేయాలి. వీలైనంత బాగా చదును చేసుకోవాలి. పెద్దగా వున్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుంటే చదును వేయడానికి, నీరు పెట్టడానికి విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. బంక నేలల్లో చివరి దమ్మ చేసి చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవచ్చు. వితే సమయానికి నీరు లేకుండా బురదగా వుంటే చాలు. ఇసుక శాతం ఎక్కువ వున్న నేలలో విత్తాలనుకున్న రోజే ఆఖరి దమ్ముచేసి, చదునుచేసి పలుచటి నీటి పొర వుండేటట్లు చూసుకోవా లి. మండికట్టి మొలకవచ్చిన విత్తనాలను వెదజల్లిగాని, డ్రమ్ సీడర్తోగాని విత్తుకోవాలి. దమ్మ చేసి చదును చేసిన పొలంలో మండి కట్టిన విత్తనాన్ని పొలమంతా సమంగా పల్చటి నీటి పొరనుంచి వెదజల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్మలుంటాయి.

ప్రతి డ్రమ్మకు 20 సెం.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలు వుంటాయి. ఈ డ్రమ్మలో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్లో కేవలం 3/4 వంతు మాత్రమే గింజలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్సీ డర్ లాగితే 8 వరుసల్లో వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకు కుదురుకు మధ్య దూరం 5-8 సెం.మీ. వుంటుంది. ఒక్కో కుదురులో 5-8 గింజలు రాలడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల (మొలక సరిగ్గా లేకనో లేక పక్షులు తినివేయడంవల్లో) కుదురులోని గింజలు 50 శాతం దెబ్బతిన్నా మి గిలిన 50 శాతం గింజల నుండి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది. రకాన్నిబట్టి గింజలు రాలడాన్ని బట్టి రంధ్రాలను స్థాపర్స్‌తో మూసుకోవాలి. సన్నగింజ రకాలకు రంధ్రం వదిలి రంధ్రం మూసేయాలి. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పు కాలిబాటలు ఉంచుకోవాలి. తాడు వాడి డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక ఎకరా విత్తడానికి కేవలం ఇద్దరు కూలీలు సరిపోతారు. ద్ర మ్ సీడర్ లాగడానికి ఒక మనిషి, గింజలు నింపడానికి, తాడు మార్చడానికి ఇంకొక మనిషి అవసరమవుతారు. ఒక ఎకరా విత్తడానికి సాధారణంగా 120 నిమిషాలు (2 గంటలు) సరిపోతుంది. ఒకరోజులో ఒక యూనిట్తో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు.

ఈ పద్ధతికి కూడా సాధారణ పద్ధతిలో సిఫారసు చేసిన మోతాదే సరిపోతుంది. కాకపోతే దమ్మలో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు (మొత్తం మోతాదు) మరియు పొటాష్ ఎరువు (సిఫారసు చేసిన మోతాదులో సగం) మాత్రమే వేయాలి. దమ్ములోకానీ, విత్తేటప్పడుకానీ నత్రజనిని వేస్తే కలుపు ఎ క్కువగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో నత్రజనినిచ్చే ఎరువులను వేయకూడదు. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి 1/3 భాగం విత్తిన 15-20 రోజులకు, 1/3 భాగం విత్తిన 40-45 రోజులకు మరియు మిగిలిన 1/3 భాగం నత్రజని, సగం పొటాష్ విత్తన 60-65 రోజులకు వేయాలి. పంట తొలిదశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగుచేయడం వలన కలుపు సమస్య ఎక్కు వ ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఒక ఎకరాకు 35 గ్రా. ఆక్సాడయా ర్థిల్ మందును లేదా ప్రెట్లాక్లోర్ 400 మి.లీ.లు లేదా పైరజో సల్పురాన్ 100 గ్రా, మందును 20 కిలోల పొడి ఇసు కలో కలిపి విత్తిన 3-5 రోజుల మధ్య (మొలకలు పచ్చగా తిరిగిన తర్వాత) పొలంలో పలుచగా నీరు పెట్టి కలుపు మందును చల్లాలి. ఈ తర్వాత పొలంలోని నీటిని తీసివేయకుండా జాగ్రత్త పడాలి.

డ్రమ్ సీడర్తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు కోనోవీడర్ని నడపాలి. డ్రమ్సీడర్ పద్ధతి వరకు ప్రత్యేకమైన కోనోవీడర్స్ అందుబాటులో వున్నాయి. కోనోవీడర్ నడపడం వలన వరుసల్లో మొలచిన కలుపు భూమిలోకి కలియబడుతుంది. తదుపరి 10 రోజులకొకసారి 2 సార్లు కలుపు ఉన్నా లేకపోయినా కోనోవీడర్ను వరుసల్లో నడపడం వలన భూమి బాగా కదిలి వేరు వ్యవస్థకు గాలి, పోషకాలు బాగా అందుతాయి. ఎక్కువ పీచు వేర్లు వృద్ధి చెంది వేరు వ్యవస్థ బలంగా తయా రవుతుంది. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు పెట్టి మొక్క గుబురుగా తయారవుతుంది. దిగుబటి పెరుగుతుంది. కోనోవీడర్ ను నడపాలనుకున్న ముందురోజు సాయంత్రం పొలంలో పలుచగా నీరు పెట్టాలి. పలుచని నీటి పొర మీద పళ్ళ చక్రా లు మట్టి అంటుకోకుండా బాగా దొర్లుతాయి. పైరు పెరిగే దశలో అక్కడక్కడ మిగిలిన కలుపు మొక్కలను కూలీలచేత తీయించాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా వుండే బిస్ ఫైరిబాక్ సోడియం అనే కలుపు మందును 80 నుండి 120 మి.లీ. 200 లీ. నీటికి కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా వున్న పొలానికి సైహలో ఫాప్ బ్యుటైల్ మందుని 300-400 మి.లీ. వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా వుంటే 2, 4డి సోడియం లవణం 400 గ్రా. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి.

శ్రీ పద్ధతిలో లాగానే ఈ పద్ధతిలో నీరు పెట్టాలి. విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ వుండకుండా కేవలం బురదగా మాత్రమే ఉంచాలి. ఎక్కువైన నీరు బయటకు పోవడానికి కాలు వలు ఏర్పాటు చేయాలి. దీనివలన వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు పెడతాయి. పైరు పొట్టద శ నుండి పంట కోసే వారం పది రోజులమందు వరకు 2 సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. సాధారణ వరి సాగుతో పోల్చుకుంటే డ్రమ్ సీడర్ పద్దతిలో పురుగులు, తెగుళ్ళ తాకిడి తక్కువగా ఉంటుంది. మొక్కలకు గాలి, వెలుతురు బాగా ప్రసరించడం వలన మొక్కలు ఆ రోగ్యంగా పెరుగుతాయి. చీడపీడల నివారణకు సాధారణ వరిసాగుకు మాదిరిగానే సస్యరక్షణ చేపట్టాలి. సాధారణ పద్ధతిలో పోలిస్తే డ్రమ్సీడర్ పద్ధతిలో సాగు చేస్తే ఏ రకమైనా వారం నుండి పది రోజుల ముందే కోతకొస్తుంది. మామూలు పద్ధతిలో పోలిస్తే ఈ పద్ధతిలో 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి వస్తుంది. రైతుకు సాధారణ దిగుబడి వచ్చినా రైతుకు ఈ పద్ధతిలో నారుమడి పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పనులపై ఖర్చు తగ్గుతుంది. కాబట్టి అధిక నికర ఆదాయం వస్తుంది.

కావున రైతులు డ్రమ్సీడర్ ద్వారా విత్తి, వరికోత యంత్రం ఉపయోగించి పంటను సాగు చేసినట్లయితే వరిసాగులో బాగా ఖర్చు తగ్గి అధిక నికర ఆదాయం పొందవచ్చును. వివిధ ప్రాంతాల్లో నాటటానికి అనువైన వరివంగడాలే చాలా వరకు నేరుగా వెదజల్లి పండించటానికి కూడా అనుకూలం. కాండం గట్టిగా ఉండి, పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలంలో మురుగు నీరు పోవడానికి బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్మ చేసి తరువాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి సమానంగా చదునుచేసి, మట్టి పేరుకొన్న తర్వాత ప్రతి 2 మీ.లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. మొలకెత్తిన విత్తనాన్ని(ముక్కు బయటకు రాగానే) పొలంలో పలచటి నీటి పొర ఉంచి సమానంగా వెదజల్లాలి లేదా 8 సాళ్ళ పరికరంతో నీరుపూర్తిగా తీసివేసి కూడా విత్తవచ్చు. మొక్కలు మొదటి ఆకు పూర్తిగా పరి విచ్చుకొనే వరకు (సుమారు 7-10 రోజుల వరకు) పంటకు ఆరుతడులు అవసరం.

నేరుగా విత్తి పండించే పొలాల్లో కలుపు బెడద ఎక్కువ. కలుపు నివారణకు ఎకరానికి బెంథియోకార్చ్ 1.25 లీ, గానీ, బుటాక్లోర్, సేఫనర్ 1.25 లీ, గాని, అనిలోఫాస్ 0.5 లీ, గాని విత్తిన 8-10 రోజులలో, 25 కిలోల ఇసుకతో కలిపి పొలమంతా పలుచటి నీటిలో సమానంగా వెదజల్లాలి. మొలకెత్తిన 20-25 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా వస్తే, లీటరు నీటికి 2.0 గ్రా. ఫెర్నాక్సోన్ (2,4-డి సోడియం లవణం)ను కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపు మొక్కలపై పడునట్లు పిచికారి 53 నివారించవచ్చు కలుపు మొక్కలు చిన్నవిగా ఉన్నపుడే కలుపు నాశిని పిచికారి చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చును. సిఫారసు చేసిన పూర్తి భాస్వరం మరియు సగం పొటాష్ ఎరువును ఆఖరు దమ్మలో వేసి కలియదునాలి. మిగిలిన సగం పొటాష్ను అంకురం దశలో వాడాలి. సిఫారసు చేసిన నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, విత్తిన 15 రోజులకు, 35 రోజులకు, 60 రోజులకు నీరు పూర్తిగా తీసివేసి బురద పదునులో వేయాలి. శ్రీ వరి సాగు పద్ధతిలో తక్కువ ఖర్చు మరియు తక్కువ నీటితో అధిక దిగుబడులు పొందవచ్చును. శ్రీ వరి సాగు పద్ధతి 1980 దశకంలో మడగాస్కర్ దేశంలో రూపొందించ బడింది.

ఈ రకపు వరి సాగు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించు కొంటున్నది. ఈ పద్ధతిలో ముఖ్యంగా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకు పోయి భూమి లోపల పొరల నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి. వరి బాగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వాలంటే పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలను రైతులు భావిస్తారు. కాని వరి నీటిలో బ్రతకగలదు గాని నీటి మొక్క కాదు. నీరు నిల్వ ఉన్నపుడు వరి ప్రేళ్ళలో గాలి సంచులు తయారు చేయడానికి చాలా శక్తి వినియోగించ బడుతుంది. అంటే ధాన్యం చేయడానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి సంచులు తయారు చేసి తద్వారా బ్రతకడానికి వాడు కొంటుంది.

వరి పూత దశ కు వచ్చేటప్పటికి 70 శాతం వేర్లు ముదిరి, కొసలు కృశించి పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీ పద్ధతి వరి పొలం లో నీరు నిలువ ఉండకుండా చూడాలి. కనుక మామూలు పద్ధతిలో ఉపయోగింప బడే నీటిలో 1/3 నుండి శాతం నీరు సరిపోతుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమయితే శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువ.

శ్రీ పద్ధతి, వరిపైరు సహజంగా పెరగటానికి దోహదపడుతుంది. కాబట్టి వరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకుపోయి, భూమి లోపల పొరల నుండి పోషక పదార్థాలను తీసు కోగలుగుతాయి. సాధారణ సాగు పద్ధతిలో మూడు దుబ్బులను కలిపి పీకడానికి 28 కిలోల బలం కావలసి వస్తే శ్రీ పద్ధతి లో సాగు చేసిన ఒక వరి దుబ్బును పీకడానికే 53 కిలోల బలం అవసరమవుతుంది. వరి బాగా పెరిగి ఎక్కువ దిగుబడినివ్వాలంటే పొలంలో ఎప్పడూ నీరు నిలువ ఉండాలని రైతులు భావిస్తారు. కాని, వరి నీటిలో బ్రతుకగలదు కాని నీటి మొక్క కాదు. పొలంలో నీరు నిల్వ ఉన్నప్పడు వరి వ్రేళ్ళలో గాలి సంచులు తయూరు చేయడానికి చాలా శక్తిని వినియోగిస్తుంది. అంటే, ధాన్యం తయారు చేయటానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి సంచులు త యారు చేసి తద్వారా బ్రతకడానికి వాడుకుంటుంది. అంతేగాక వరిలో పూత దశకు వచ్చేటప్పటికి, 70 శాతం వేర్ల కొసలు కృశించి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీ పద్ధతిలో వరి పొలంలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. కాబట్టి ఈ పద్ధతిలో వరి సాగుకు సాధారణంగా వరి పండించడానికి అవసరమయ్యే నీటిలో సగం నుండి మూడోవంతు నీరుమార్చడం సరిపోతుంది.