నిషేధిత గుట్కా స్వాధీనం

384

సిద్దిపేట, మార్చి 22 (న్యూస్‌టైమ్): మండల కేంద్రంమైన జగదేవపూర్ గ్రామంలో పుల్లూరి నరసయ్య కిరాణా షాపులో ప్రభుత్వం నిషేధించిన గుట్కా కలిగి ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్ సిఐ ప్రసాద్, సిసిఎస్ సిఐ నరసింహారావు, టాస్క్ఫోర్స్ సిబ్బంది రాము, అశోక్, నర్సింలు, అమృత్, శివ కుమార్, నవీన్, సాయిబాబా కలిసి వెళ్లి కిరాణా షాపుపై రైడ్ చేసి 1,00,000 రూపాయల గుట్కాలు సాగర్, స్వాగత్, ఆర్ఆర్, విమల్, వి1, గల ప్లాస్టిక్ బ్యాగులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించగా జగదేవపూర్ ఎస్ఐ పరమేశ్వర్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సిఐ ప్రసాద్, సిసిఎస్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, టొబాకో ముడి పదార్థాలు కలిగివున్న, అక్రమంగా రవాణా చేసిన, ఇతరులకు అమ్మినా వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గ్రామాలలో పట్టణాలలో గుట్కాలు అమ్ముతున్న గుట్కాలు ఇళ్లల్లో, షాపుల్లో కలిగి ఉన్నారని సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐలు ఒక ప్రకటనలో తెలిపారు.