నా హైదరాబాద్..!

513

జర్నలిజంలో జన్మనిచ్చిన హైదరాబాద్..!!
అక్షరానికి ఉలై చెక్కిన హైదరాబాద్..!!
బిడ్డను అమ్మ ఒడిలో పెట్టుకుని లాలించినట్లు లాలించిన హైదరాబాద్..!!
జీవిత పాఠాన్ని చాలా చక్కగా ..చిక్కగా నేర్పిన హైదరాబాద్..!!
సాక్షిలో వర్క్‌ చేసి నడిరేత్రి నడుస్తూ వెళ్లిన రోజులు గుర్తే..!!
సాక్షిలో వర్క్‌ చేసి నడిరేయి నడిస్తూ వెళ్తుంటే..
చిరు  చినుకులు జడివానై తడిచిన రోజులు గుర్తే..!!
సాక్షిలో వర్క్ చేసి అర్థరాత్రి దాటాక నడిచి వెళ్తుంటే..
గజగజ వణింకించేలా చలి కాటేసిన రోజులు గుర్తే..!!
ఆ చలిలో ఫుట్ పాత్‌ల మీద వణుకుతూ పడుకున్న గరిబోడు గుర్తే..!!
ట్యాంక్ బండ్ మీద స్నేహితులతో సరదా కబుర్లు గుర్తే..!!
సాక్షి జాబ్..సర్వీ ఛాయ్ ..ఉస్మానియా బిస్కెట్  జీవితాంతం గుర్తే..!
హైదరాబాద్  ఓ మినీ ఇండియా..!!
తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ కలిపి వాడే ..
పదాల పటాస్‌లు  హైదరాబాద్‌కే సొంతం..!!
హైదరాబాద్‌కు నేనిచ్చింది ఏం లేదు..
కానీ..హైదరాబాద్  చాలా ఇచ్చింది..!!
జాబ్ ఇచ్చింది..జీవితం ఇచ్చింది..
అక్షరాన్ని ఆయుధంగా చేసి పోరాడటం నేర్పింది..!!
హైదరాబాద్ ఓ మర్రి చెట్టు..
ఆ చెట్టు నీడ నుంచి పోతున్నాననే బాధ..
ఆ చెట్టు నీడలో ఇన్నేళ్లు బతికాననే సంతోషం…!!
బాధ, సంతోషం రెండు కాళ్లుగా నా అడుగులు ఆంధ్రా వైపు..!!
కోటి ఆశలతో కృష్ణమ్మ తీరానికి..
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ చెంతకు..
కృష్ణమ్మ, దుర్గమ్మ దీవెనలతో నా జీవితం ‘మురళి’ గానం కావాలి..!!

                                                                              –  వై.వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్