విలేకరులను అగౌరపర్చిన ఎమ్మెల్యే

348

గుంటూరు, మార్చి 22 (న్యూస్‌టైమ్): విలేకర్లను అగౌరవ పరిచి, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఏమన్నారో ఓసారి వినండి… గుంటూరు జిల్లా వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసత్యాలను ప్రసారం చేస్తున్నారంటూ విలేఖరుల పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించిన బ్రహ్మనాయుడు వ్యాఖ్యలతో కంగుతిన్నారు జర్నలిస్టులు. ప్రెస్ మీట్‌ను బాయ్‌కాట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు కొందరు జర్నలిస్టులు.

కొన్ని సమస్యలపై ప్రశ్నించిన విలేకరులపై ‘‘నీ చరిత్ర నాకు తెలుసని, నీ వల్ల కాదు కదా నీ అబ్బ వల్ల కూడా కాదు’’ అని ఎమ్మెల్యే అనడం కొసమెరుపు. ‘‘మగాడివైతే వార్త రాయి’’ అని బెదిరిస్తూ కుర్చీలో నుంచి పైకి లేచారు ఎమ్మెల్యే… విలేఖరుల పట్ల, అనుచితంగా ప్రవర్తించిన బ్రహ్మనాయుడు తీరుపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి.