హాట్సాఫ్ రా మల్లన్న

790

నీకు రాజకీయ నేపథ్యం లేదు తాతల తండ్రుల వారసత్వం లేదు పార్టీ లేదు ప్రజలు నీ వెంట ఉన్నారు అన్న నమ్మకం లేదు లక్షల్లో కార్యకర్తలు లేరు వేలల్లో ప్రజా ప్రతినిధులు లేరు నీవెంట ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు మంత్రులు లేరు మంది లేరు మార్బలం లేదు చుట్టూ తుపాకులు లేవు కులం బలం లేదు అంగ బలం లేదు ఆర్థిక బలం లేదు బంధువర్గం లేదు బాధల్లో ఓదార్చే వారు లేరు…కేవలం మదమెక్కిన రాజకీయ మత్త గజాల అహంకారాన్ని అవినీతినీ అడుగడుగున ఎండగట్టి ఏకి పారవేసే వాక్చాతుర్యం గుప్పెడంత గుండె బలమే తప్ప.
“హాట్సాఫ్ రా మల్లన్న”

ఓడి గెలిచావు పోరాడి నిలిచావు రాజకీయం అనేది ఎవడబ్బ సొత్తు కాదు సామాన్యుడు కూడా ఎదగవచ్చు ప్రజల గుండెల్లో ఒదగ వచ్చు అని నిరూపించావు అసెంబ్లీ మెట్ల దగ్గరే ఆగిపోయారవు అంతులేని గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచిపోయావు.
“హ్యాట్సాఫ్ రా మల్లన్న”

బిసి బిడ్డవు బలహీనవర్గాల బంధువు దళిత వర్గాల ధాతువు మా 39 సంవత్సరాల ముద్దుబిడ్డవు నిన్ను మా కడుపులో దాచుకుంటాం కళ్ళల్లో పెట్టుకుంటాం అణగారిన వర్గాల ప్రతినిధిగా ఆరాధిస్తాం.
“హాట్సాఫ్ రా మల్లన్న”

ఈరోజు నీ ఓటమి ఒక పాఠం రేపటికి విజయానికి ఉదయం రాజకీయ నాయకుడివైతే మళ్లీ ప్రశ్నిస్తావో లేదో అన్న మా కొందరి భయం ప్రశ్నతో ఇంకొన్నాళ్లు ప్రయాణించమని మా తీర్పు, జవాబు చెప్పని జవాబుదారితనం లేని ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉండు జడిపిస్తూనే ఉండు మా గుండెల్లో పదిలంగా ఉండు. “హాట్సాఫ్ రా మల్లన్న”

 -మన్నె చంద్రయ్య
                                                                                            ఉపాధ్యాయుడు