తగ్గితే తప్పేంటి…?

339

– ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పిలుపుకు పెరుగుతున్న మద్దతు
– ప్రతి పక్షాలు సైతం కాదనలేని పరిస్థితి

ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బాపట్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుందాం అని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఒక పిలుపు ఇచ్చారు. దీనిపై మొదట్లో ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఎన్నికలకు భయపడుతున్నారని, మరో రకంగా నానా విధాలుగా ఆరోపణలు చేశారు. అయితే వీటన్నిటిని పట్టించుకోకుండా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గతంలో ఎన్నడూ చూడని విధంగా బాపట్ల నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలను, బాపట్ల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన అభివృద్ధిని, పనితనాన్ని దగ్గర్నుంచి చూసిన మాజీ శాసనసభ్యులు, టిడిపి నాయకులు మంతెన అనంతవర్మ రాజు ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఇచ్చిన పిలుపు కు మద్దతు పలికారు. బాపట్ల జిల్లా అవుతుంది.. కానీ బాపట్లను జిల్లా కేంద్రంగా చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పడుతున్న తపన, కష్టాన్ని గమనించిన ఒక మాజీ శాసనసభ్యులుగా ముందుకు వచ్చి అవును.. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఇచ్చిన పిలుపు కు సహకరిద్దాం అంటూ ఆయన మద్దతు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు బహుమతిగా బాపట్ల మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకుందాం అంటూ ఆయన ఒక పిలుపునిచ్చారు. ఆయనే కాకుండా ప్రతిపక్ష పార్టీలో కూడా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిలుపుకు సానుకూల స్పందన రావడం ప్రారంభమైంది. ఎంతో విద్యావంతులైనటువంటి బాపట్ల ప్రాంతవాసులు అవును.. తగ్గితే తప్పేంటి..? ఒక హుందా అయిన పదవిలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఒక మెట్టు దిగి పార్టీలకతీతంగా అందరూ చేతులు కలిపి మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఒక బహుమతిగా ఇచ్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ఆయన ఇచ్చిన పిలుపుకు సానుకూల స్పందన రావడం చూస్తుంటే అభివృద్ధిలో మన బాపట్ల ప్రాంతం నూతనంగా ఏర్పడబోయే జిల్లాల్లో కూడా ముందు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.