డీజీపీని అభినందించిన సీఎం జగన్‌

243

అమరావతి, మార్చి 22 (న్యూస్‌టైమ్): జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు చూపడంతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 అవార్డులు సాధించినందుకు డీజీపీ, పోలీస్‌శాఖను సీఎం జగన్‌ అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీగా ఎంపికైన గౌతమ్‌ సవాంగ్‌ను, అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 అవార్డులు గెలుచుకున్న పోలీస్‌ శాఖను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ జి. పాలరాజు ఉన్నారు.